Share News

AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్

ABN , Publish Date - Nov 15 , 2025 | 09:20 AM

ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనిల్ చోకరాని సిట్ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఏపీకి తీసుకువచ్చి ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్
AP Liquor Scam

అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం కుంభకోణం కేసు (AP Liquor Scam)లో ఏ49 అనిల్ చోకరా (Anil Chokara)ను నిన్న(శుక్రవారం) ముంబైలో అరెస్టు చేశారు సిట్ అధికారులు. ఆయనను విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇవాళ(శనివారం) విజయవాడ ఏసీబీ కోర్టులో అనిల్ చోకరాని హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఏ1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ7 ముప్పిడి అవినాశ్‌రెడ్డిలకు సంబంధించిన బ్లాక్ మనీని వైట్‌గా మార్చడంలో అనిల్ చోకరా కీలక నిందితుడుగా ఉన్నారని సిట్ అధికారులు తెలిపారు.


కాగా, ముంబై కేంద్రంగా షెల్ కంపెనీల ద్వారా నిధులను చట్టవిరుద్ధంగా అనిల్ చోకరా మళ్లించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆ ధనాన్ని మద్యం సిండికేట్‌లకు, అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించడానికి ఉపయోగించారని దర్యాప్తులో నిర్ధారించారు. రూ.77.55 కోట్లను ఆదాన్, లీలా, స్పై నుంచి ముంబైకి చెందిన నాలుగు షెల్ కంపెనీల ద్వారా బ్లాక్ మనీ మార్పిడి చేసినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. చట్టానికి దొరకకుండా ఉండేలా మళ్లీ 32 ఇతర షెల్ కంపెనీలకు వివిధ మార్గాలుగా నగదు పంపిణీ చేసినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. అయితే, మనీ ల్యాండరింగ్ కేసులో గతంలో అనిల్ చోకరా రెండుసార్లు అరెస్టు అయిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆర్ఐ సతీష్ కుమార్‌ హత్య కేసు.. ఏబీఎన్ చేతిలో ఎఫ్‌ఐఆర్‌ కాపీ

జగన్ హయాంలో పారిశ్రామిక వేత్తలను తరిమేశారు.. కలిశెట్టి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 15 , 2025 | 10:33 AM