AP Cabinet sub committee: ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Oct 24 , 2025 | 02:52 PM
భూ సంస్కరణలపై శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.
అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): భూ సంస్కరణల (Land Reforms)పై ఇవాళ(శుక్రవారం) ఏపీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. ప్రధానంగా భూ సంస్కరణల గురించి మంత్రులు మాట్లాడారు.
ఈ సమావేశానికి మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, నారాయణ, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి హజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ‘పేదలందరికీ ఇళ్లు’కు సంబంధించిన విషయాలపై మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలో మంత్రులు చర్చించారు.
హౌసింగ్, రెవెన్యూ సంస్కరణలపై చర్చించాం: మంత్రి అనగాని సత్య ప్రసాద్
మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి గల హౌసింగ్, రెవెన్యూ సంస్కరణల జీవోఎంలపై చర్చించామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. సర్వీస్ ఇనామ్ భూముల విషయంలో కమిటీలు వేసి మంచి పాలసీ తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. జర్నలిస్టుల హౌసింగ్‌పై కూడా ఈ సమావేశంలో చర్చించామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
జూన్ చివరిలోగా టిడ్కో ఇళ్లు పూర్తి: మంత్రి నారాయణ
టిడ్కో కింద 7 లక్షల ఇళ్లు గ్రౌండ్ చేస్తే గత జగన్ ప్రభుత్వం వాటిని 2.5 లక్షలకు తగ్గించిందని మంత్రి నారాయణ తెలిపారు. జూన్ చివరిలోగా టిడ్కో ఇళ్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కర్నూలు ప్రమాదం... ట్రావెల్స్ సంస్థలపై రామచందర్ రావు సీరియస్
సీఐఐ సదస్సుకు రండి.. పారిశ్రామికవేత్తలకు లోకేష్ ఆహ్వానం
Read Latest AP News And Telugu News