MP Kesineni Shivnath: ఏపీ టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తుంది
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:10 PM
MP Kesineni Shivnath: ఏపీ భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధివిధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు.

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఇవాళ(సోమవారం) రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ, క్లస్టర్ల రూపకల్పన కోసం మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమం జరిగింది. మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ సదస్సులో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు విజన్ 2020 వల్ల ఏపీ టెక్నాలజీ రంగంలో అభివృద్ధి పథంలో సాగుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో విమానయానం, రక్షణ రంగాల్లో కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే వందశాతం రక్షణ రంగ ఉత్పత్తుల తయారికీ కృషి జరుగుతుందని తెలిపారు. రాష్ట్రానికి సలహాదారులుగా ఉన్న డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ అనుభవం చాలా అవసరమని అన్నారు. రాష్ట్రం భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధివిధానాలు రూపొందిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్‌కు ఆహ్వానం పలుకుతున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
మీ ఇంట్లో ఏపీ ఉందా.. అయితే ఈ జాగ్రర్తలు పాటించండి..
For More AP News and Telugu News