Share News

Nimmala Ramanaidu : ఆ బ్యారేజీని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. మంత్రి నిమ్మల ఫైర్

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:39 PM

Minister Nimmala Ramanaidu: తారకరామ తీర్థ సాగర్ బ్యారేజీపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. తీర్థ సాగర్ బ్యారేజీని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వారసత్వంగా బకాయిలు ఇచ్చి వెళ్లిందని అన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా తాము బకాయిలు చెల్లిస్తున్నామని చెప్పారు.

Nimmala Ramanaidu : ఆ బ్యారేజీని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. మంత్రి నిమ్మల ఫైర్
Minister Nimmala Ramanaidu

విజయనగరం: తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇవాళ(మంగళవారం) ఉత్తరాంధ్రలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఉదయం విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలంలోని తారక రామ తీర్థ సాగరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా టెక్కలికి మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించనున్నారు.


సాయంత్రం మదనగోపాల సాగరం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర వంశధార ఎడమ కాలువ పనులను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. 90 శాతం పనులు పూర్తి అయిన తారకరామ తీర్థ ప్రాజెక్ట్ బ్యారేజ్‌ను గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్యం చేసిందని మండిపడ్డారు. బ్యారేజ్ మెయింటెనెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తారకరామ తీర్థ ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్‌కి రూ.176 కోట్లు కేటాయించాల్సి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.


విజయనగరం పట్టణానికి, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు నీరందించడంలో ఇదే కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజల రుణం తీర్చుకోవాలని సీఎం చంద్రబాబు తనకు చెప్పారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు నాడు టీడీపీకి, నేడు ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతు తెలిపారని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం వారసత్వంగా బకాయిలు ఇచ్చి వెళ్లిందని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా బకాయిలు చెల్లిస్తున్నామని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రయోజనాలను మొదటి ప్రాధాన్యతగా పెట్టుకుని పనిచేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

YSRCP Leaders: దూకుడు పెంచిన కూటమి సర్కార్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్

IPS officer Anjaneyulu: కాదంబరి జత్వాని కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్

AP NEWS: ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ

High Court: చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 01:11 PM