Nara Lokesh :తగ్గేదేలే.. ఇండియా టుడే కాంక్లేవ్‌లో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:20 PM
Nara Lokesh :వైసీపీ పాలనలో ఇసుక అక్రమ మైనింగ్ జరిగిందని ఆంధప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్‌గా పని చేస్తున్నారని తెలిపారు. టాటా పవర్‌తో 7 గిగా వాట్స్ ఒప్పందం జరిగిందని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

ఢిల్లీ: మనమిత్ర పథకం ద్వారా వాట్సాప్ సేవలను ఏపీలో అందుబాటులోకి తీసుకువచ్చామని ఆంధప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కుల ధ్రువపత్రాలు, హాల్ టికెట్లు, ఇతర పత్రాలు,ల్యాండ్ రికార్డులన ఈజీగా వాట్సాప్ సేవలో పొందవచ్చని అన్నారు. ఇవాళ(శనివారం) ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడు దేశ ప్రగతిలో దోహదపడుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్‌గా పని చేస్తున్నారని తెలిపారు. టాటా పవర్‌తో 7 గిగా వాట్స్ ఒప్పందం జరిగిందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో తెలుగును ప్రమోట్ చేస్తున్నామని.. స్థానిక భాష తెలుగు అని ఉద్ఘాటించారు. భాషను బలవంతంగా రుద్దుతారని తాను నమ్మనని చప్పారు. వివిధ భాషలు నేర్చుకోవడం అవసరమన్నారు. ఏపీలో రెడ్ బుక్ మైయింటైయిన్ చేస్తున్నామని అన్నారు.
వైసీపీ పాలనలో ఇసుక అక్రమ మైనింగ్ జరిగింది, సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుందని తెలిపారు. ఎన్డీఏకు తాము భేషరతుగా మద్దతు ఇస్తున్నామని ఉద్ఘాటించారు.హెచ్ ఆర్డీ శాఖ కావాలని తాను ఎంచుకున్నానని, దానిలో బలమైన టీచర్స్ యూనియన్లు ఉన్నాయని గుర్తుచేశారు. తన భార్య తన క్రెడిట్ కార్డు బిల్లు పే చేస్తుందని చెప్పారు. మహిళా దినోత్సవం ఒక్క రోజు మాత్రమే కాదు ...ప్రతిరోజూ జరుపుకోవాలని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో హైదరాబాద్‌లో 45000 మంది ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఇండియా గెలుస్తుందని మంత్రి నారా లోకేష్ ఆశాభవం వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే మొత్తం సభ సంఖ్యాబలంలో పదిశాతం ఉండాలని అన్నారు.చట్టాన్ని గౌరవించే వ్యక్తిని తానని చెప్పారు. పార్లమెంట్, శాసనసభలో ఉండే నిబంధనలను తాము ఎలా ఉల్లంఘిస్తామని ప్రశ్నించారు. ప్రపంచ భాషలు నేర్చుకోవడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. జర్మనీ, జపాన్ భాషలను నర్సింగ్ వృత్తిలో ఉండే వారికి నేర్పిస్తున్నామని. దాని ద్వారా వారికి ఆదేశాల్లో అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పిల్లలకు ఏది ఇష్టమో అది నేర్చుకునే అవకాశాలు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఏపీ
Venkaiah Naidu: ఉన్నత విద్యలో మార్పుతోనే దొరస్వామికి నివాళి
Power Tariff: విద్యుత్ ట్రూ అప్ పాపం వైసీపీదే
Read Latest AP News and Telugu News