Share News

Kandula Durgesh: నవంబరు 4 నుంచి 6 వరకు మంత్రి కందుల దుర్గేష్ లండన్‌ పర్యటన

ABN , Publish Date - Oct 31 , 2025 | 07:41 PM

ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. నవంబరు 4వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు లండన్‌లో పర్యటిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Kandula Durgesh: నవంబరు 4 నుంచి 6 వరకు మంత్రి కందుల దుర్గేష్ లండన్‌ పర్యటన
Minister Kandula Durgesh

అమరావతి, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) వ్యాఖ్యానించారు. నవంబరు 4వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు లండన్‌ (London Tour)లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 2వ తేదీన లండన్‌ పర్యటనకు బయలు దేరుతున్నట్లు చెప్పుకొచ్చారు. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 ప్రదర్శనలో పాల్గొంటున్నట్లు వివరించారు. లండన్ పర్యటనలో 30 మంది విదేశీ ప్రతినిధులతో ఏపీ పర్యాటక రంగ అభివృద్ధిపై చర్చలు జరుపుతామని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్.


అమరావతి వేదికగా ఇవాళ(శుక్రవారం) మీడియాతో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఏపీని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విదేశీ పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. డబ్ల్యూటీఎం వేదికగా ఏపీ స్టాల్‌ను ఏర్పాటు చేసి రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పిస్తామని తెలిపారు. లండన్ పర్యటనలో భాగంగా పలు దేశాల్లో పర్యాటక రంగం ఎలా అభివృద్ధి చెందుతున్నదో అధ్యయనం చేస్తామనిపేర్కొన్నారు మంత్రి కందుల దుర్గేష్.


ఏపీ పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు కృషి చేస్తామని వివరించారు. ఏపీ పర్యాటక రంగాన్ని విశ్వవ్యాప్తం చేయడం వల్ల విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు. తద్వారా ఏపీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని భావిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుఫానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి: పవన్ కల్యాణ్

టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2025 | 08:07 PM