Massive Explosion: ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..
ABN , Publish Date - Nov 23 , 2025 | 08:04 AM
పల్నాడు జిల్లాలోని రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్‌లో బయో డీజిల్ బంకులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బంకులోని ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి.
పల్నాడు జిల్లా, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలోని రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్‌లో బయో డీజిల్ బంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బంకులోని ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందజేశారు.
ఘటన స్థలానికి అగ్నిమాపక అధికారులు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాద స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులని ఘటన స్థలం నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. ఈ ప్రమాదంలో గురజాలకు చెందిన రషీద్ అనే వ్యక్తి మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ఐబొమ్మ రవి కేసు.. వెలుగులోకి కీలక అంశాలు
Read Latest AP News And Telugu News