Share News

CM Chandrababu: తెలుగు తమ్ముళ్లకి మరో గుడ్‌ న్యూస్.. ఆ కమిటీలపై సీఎం చంద్రబాబు క్లారిటీ..!!

ABN , Publish Date - Nov 07 , 2025 | 08:52 PM

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 11 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉండనున్నారు.

CM Chandrababu: తెలుగు తమ్ముళ్లకి మరో గుడ్‌ న్యూస్.. ఆ కమిటీలపై సీఎం చంద్రబాబు క్లారిటీ..!!
CM Chandrababu

అమరావతి, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు, కమిటీల ఎంపికపై ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పెషల్ ఫోకస్ పెట్టారు. రేపు టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులను, కమిటీలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కమిటీలపై కసరత్తు పూర్తి చేశామని చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు రానున్నారు.


ఈ క్రమంలో పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండనున్నారు సీఎం చంద్రబాబు. అలాగే, తిరువూరు టీడీపీ నేతల పంచాయితీపై క్రమశిక్షణ కమిటీ నివేదికని కూడా సీఎం చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉంది. గత వారం పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన సమయంలో ఇక ప్రతివారంలో ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయంలోనే తెలుగు తమ్ముళ్లకి అందుబాటులో ఉంటారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నారు మంత్రి నారా లోకేష్.


ఈ వార్తలు కూడా చదవండి...

ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్

రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్జీ రంగా పోరాటం చేశారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 07 , 2025 | 10:37 PM