Tenth Class Exam Schedule: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Nov 21 , 2025 | 06:11 PM
ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎస్ఎస్‌సీ బోర్డు. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి.
అమరావతి, నవంబరు21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ (AP Tenth Class Exam Schedule) విడుదల చేసింది రాష్ట్ర ఎస్ఎస్‌సీ బోర్టు. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది.
16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘిక శాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్2), ఏప్రిల్ 1న సెకెండ్ లాంగ్వేజ్ పేపర్2 పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్టు అధికారులు ఇవాళ(శుక్రవారం) ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు అధికారులు.

ఇవి కూడా చదవండి..
ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూముల రీ సర్వే చేయండి: రఘురామ
అలా చెప్పే దమ్ము, ధైర్యం లేదా?... జగన్‌పై మండిపడ్డ దేవినేని
Read Latest AP News And Telugu News