AP Government: ఆ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ABN , Publish Date - Mar 07 , 2025 | 02:08 PM
AP Government: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వహించేలా నిరంతరం సమీక్ష చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారినే కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించామని తెలిపారు.

అమరావతి: విలేజ్ హెల్త్ క్లినిక్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానం ఇచ్చారు. 2017లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని గుర్తుచేశారు. ఏపీలో 10,032 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ల నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. 3,015 కేంద్రాల నిర్మాణం పూర్తయ్యిందని.. కొన్ని పురోగతిలో ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వహించేలా నిరంతరం సమీక్ష చేస్తున్నామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారినే కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించామని తెలిపారు. సీహెచ్ఓ ఉద్యోగాలు ప్రస్తుతం 234 ఖాళీలు ఉన్నాయన్నారు. సీహెచ్ఓలకు రూ.25 వేలు వేతనంతో కాంట్రాక్టు విధానంలో తీసుకున్నామని చెప్పారు. గ్రామాల్లో ఉండే సీహెచ్ఓలకు రూ. 15 వేలు ప్రోత్సాహకం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై చర్యలు: మంత్రి అనగాని సత్యప్రసాద్
ఫ్రీహోల్డ్ భూముల అక్రమాలపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల రీ వెరిఫికేషన్ కొనసాగుతోందని అన్నారు. మొత్తం 13 లక్షల 59 వేల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశామని గుర్తుచేశారు. 11 లక్షల 56 వేల ఎకరాల్లో రీ వెరిఫికేషన్ పూర్తయిందని తెలిపారు. రీ వెరిఫికేషన్ పూర్తయిన భూముల్లో ఐదు లక్షల 8 వేల ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు తేలిందన్నారు. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో 25 వేల 214 ఎకరాలు రిజిస్ట్రర్ అవ్వగా...8,452 ఎకరాలు నిబంధనలకు విరుద్దంగా రిజిస్ట్రర్ అయ్యాయని వివరించారు. ఫ్రీ హోల్డ్ భూములపై సమగ్ర విధానాన్ని ఆరుగురు మంత్రులతో వేసిన మంత్రివర్గ ఉపసంఘం రూపొందిస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Janasena leaders criticize Ambati: వైసీపీ పాకిస్థాన్.. కూటమి ఇండియా.. జనసేన నేతల ఫైర్
YSRCP: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నాయకులు
Raghuramakrishna Raju : బుల్లెట్ దిగిందా.. లేదా.. అన్నట్టు మాట్లాడాలి..
Read Latest AP News and Telugu News