Share News

CM Chandrababu: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. పెట్టుబడులపై కీలక చర్చలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 06:51 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాల్గో రోజు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రతినిధులతోనూ పలు విషయాలపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. సింగపూర్‌లో నాల్గోరోజు బుధవారం బిజీ బిజీగా ఉండనున్నారు. వివిధ సంస్థలు-సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడనున్నారు.

CM Chandrababu: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. పెట్టుబడులపై కీలక చర్చలు
AP CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Chandrababu Naidu) నాల్గో రోజు సింగపూర్ పర్యటన (Singapore Tour) కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రతినిధులతోనూ పలు విషయాలపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. సింగపూర్‌లో నాల్గోరోజు బుధవారం బిజీ బిజీగా సీఎం చంద్రబాబు అండ్ టీం ఉండనున్నారు. వివిధ సంస్థలు-సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ఉదయం 7:30 గంటలకు క్యాపిటాలాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) సీఈవో సంజీవ్ దాస్‌గుప్తాతో రియల్ ఎస్టేట్, అర్బన్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీయల్ పార్క్‌ల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఉదయం 8 గంటలకు మండాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్‌ సీఈవో మైక్ బార్క్‌లేతో భేటీ అవుతారు. ఏకో-టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధి, వైల్డ్‌లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్‌పై మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు అండ్ టీం.


8:30 గంటలకు ఎస్ఎంబీసీ బ్యాంక్‌-ఇండియా డివిజన్, మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో సమావేశం అవుతారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలు, లిక్విడిటీ మోడల్స్‌పై సీఎం చంద్రబాబు అండ్ టీం చర్చించనున్నారు. 9 గంటలకు టెమసెక్ కంపెనీ జాయింట్ హెడ్–పోర్ట్‌ఫోలియో డెవలప్‌మెంట్ దినేశ్ ఖన్నాతో భేటీ అవుతారు. పబ్లిక్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్-హెల్త్ ఫండింగ్‌పై సహకారాన్ని కోరనున్నారు. 10 గంటలకు సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన్‌తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. భారత్ – సింగపూర్ సంబంధాలు, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం అంశాలపై మాట్లాడనున్నారు సీఎం చంద్రబాబు అండ్ టీం.


ఉదయం 11 గంటలకు భారత కాలమానం ప్రకారం నేషనల్ సెక్యూరిటీ, హోం అఫైర్స్ మంత్రి కే. షణ్ముగంతో విందు సమావేశం అవుతారు. సెక్యూరిటీ కెపాసిటీ బిల్డింగ్, పోలీస్ ట్రైనింగ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అంశాలపై సీఎం చంద్రబాబు అండ్ టీం చర్చించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు సెంబ్‌క్రాప్ సీఈఓ చార్లెస్ కోతో సీఎం చంద్రబాబు అండ్ టీం సమావేశం అవుతారు. రెన్యువబుల్ ఎనర్జీ, వాటర్ ట్రీట్‌మెంట్ ప్రాజెక్ట్‌లపై సహకారానికి సంబంధించి పలు ప్రతిపాదనలు చేయనున్నారు. అయితే ఈరోజుతో సీఎం చంద్రబాబు అండ్ టీం సింగపూర్ పర్యటన ముగియనుంది. రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. హైదరాబాద్‌ నుంచి రాత్రి 11:30గంటలకు అమరావతికి సీఎం చంద్రబాబు బృందం వెళ్లనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 06:56 AM