Raghu Rama: ఏపీలో సైబర్ క్రైమ్స్‌పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి: రఘురామ
ABN , Publish Date - Jun 26 , 2025 | 03:15 PM
ఏపీలో ఆన్‌లైన్ జూదం నివారణకు ఎలాంటి చట్టాలు అమలు చేయాలనే విషయంపై చర్చించామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు తెలిపారు. శాసనసభ పనిదినాలు పెంచాలనే పిటిషన్‌లు కూడా ప్రజల నుంచి వస్తున్నాయని వెల్లడించారు. ఇకపై ప్రతీ 15రోజులకోసారి పిటిషన్ల కమిటీ సమావేశమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కృష్ణమరాజు అన్నారు.

అమరావతి: సైబర్ క్రైమ్స్‌పై ఏపీలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు (Raghu Ramakrishna Raju) పేర్కొన్నారు. ఇవాళ(గురువారం) ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో రఘురామ కృష్ణమరాజు నేతృత్వంలో పిటిషన్ల కమిటీ సమావేశం జరిగింది. పిల్లలు, మహిళలు బెట్టింగ్ యాప్‌ల బారిన పడుతున్నారని వెల్లడించారు. టెక్నాలజీ ద్వారా ప్రజలను నిండా ముంచేస్తున్నారని అన్నారు. పిటిషన్ కమిటీలో సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్‌లపై చర్చించామని తెలిపారు రఘురామ.
సైబర్ క్రైమ్‌లు ఏపీలో బాగా పెరిగిపోతున్నాయని రఘురామ చెప్పారు. లోన్ యాప్‌లో మొదట రూ.10 వేలు ఇచ్చి.. ఆ తర్వాత రూ.20,000 కట్టాలని వేధిస్తున్నారని అన్నారు. ఏపీలో ఆన్‌లైన్ జూదం నివారణకు ఎలాంటి చట్టాలు అమలు చేయాలనే విషయంపై చర్చించామని తెలిపారు. శాసనసభ పనిదినాలు పెంచాలనే పిటిషన్‌లు కూడా ప్రజల నుంచి వస్తున్నాయని వెల్లడించారు. ఇకపై ప్రతీ 15రోజులకోసారి పిటిషన్ల కమిటీ సమావేశమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్‌ల బారిన పడి 960 మంది మరణించారని.. . ఏపీలో ఎంతమంది నష్టపోయారో తెలియదు, లెక్కలేదని చెప్పారు రఘురామ.
ప్రతిరోజు సైబర్ క్రైమ్‌కి 700 ఫిర్యాదుల వరకు వస్తున్నాయని.. అందులో ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు అవుతున్నాయో తెలియదని రఘురామ అన్నారు. సైబర్ క్రైమ్ కేసుల విషయంలో ప్రజలు స్వయంగా నిలదీయాలని చెప్పారు. ఏపీ పోలీసులకు పరుగు పందెంలో మాత్రమే గెలిస్తే సరిపోదని.. ఐటీ నాలెడ్జ్ కూడా అవసరమని సూచించారు. అలాంటి వారిని పోలీస్ శాఖలో తీసుకోవాలని.. అప్పుడే సైబర్ క్రైమ్‌లు అదుపులోకి వస్తాయని రఘురామ కృష్ణమరాజు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు..
For More AP News and Telugu News