AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:36 AM
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రులు సమాధానం ఇచ్చారు. భూ సమస్యలు, తలసేమియ వ్యాధి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై చర్చ జరిగింది. ఆయా అంశాలపై మంత్రులు మాట్లాడారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (బుధవారం) ప్రారంభం అయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్యేలు అడిగిన వివిధ అంశాలపై పలువురు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో రెవెన్యూ సమస్యలు, భూ కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Minister AnaganiSatya Prasad) సమాధానం ఇచ్చారు. ఏఏ ప్రాంతాల్లో భూముల సర్వే జరుగుతుందో వివరించారు. భూ హక్కులు ఉన్న యజమానికి న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని తెలిపారు. 2లక్షలకు పైగా ఆర్జీలు భూ వివాదాలపైనే వచ్చాయని అన్నారు. సమగ్ర భూ సర్వే జరుగుతుందని తెలిపారు. గత వైసీపీప్రభుత్వం భూ సర్వేను అవినీతి మాయంగా మార్చిందని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం భూ సర్వే పేరుతో మంచి నిర్ణయం తీసుకుందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్
జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సభ్యులు కొణతాల రామకృష్ణ, కాల్వ శ్రీనివాసులు అడిగారు. ఈ విషయంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హడావుడి చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఒక జీఓ ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జర్నలిస్టుల హోసింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్‌గా దృష్టి పెట్టారని తెలిపారు. ఈ విషయంపై కోర్ట్‌ల డైరెక్షన్ కూడా ఉందని గుర్తుచేశారు. అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని న్యాయం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో ఆయిల్ పామ్ సాగుపై చర్చ జరిగింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ( Minister Kinjarapu Atchannaidu) సమాధానాలు చెప్పారు. ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఆయిల్ పామ్ సాగు వల్ల లాభాలు కూడా వస్తాయని తెలిపారు. దీంతో పాటు డ్రిప్ ఇరిగేషన్‌పై కూడా దృష్టి పెట్టామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
తలసేమియా వ్యాధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్
అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో తలసేమియాపై చర్చ జరిగింది. తలసేమియా బాధితులకు ఆర్థిక సాయంపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆర్థికంగా అదుకోవాలని విశాఖపట్నం ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. తలసేమియా వ్యాధి గురించి మంత్రి సత్య కుమార్ (Minister Sathya Kumar) సమాధానం చెప్పారు. తలసేమియా వ్యాధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. తలసేమియా బాధితులకు అన్ని విధాలా న్యాయం చేస్తున్నామని అన్నారు. ఆర్థికంగా పెన్షన్ సౌకర్యం కల్పించడంపై మరింత దృష్టి పెడతామని తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తలసేమియాపై సమీక్ష నిర్వహిస్తోందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
High Court: చట్టం కంటే పోలీసులు ఎక్కువేమీ కాదు
AP Police: పోసానిని కస్టడీకి ఇవ్వండి
Minister Achenna Naidu: పీఎం కిసాన్‌తోపాటే అన్నదాత సుఖీభవ
Read Latest AP News and Telugu News