Share News

State GST vs Central GST: రాతల్లో నేలచూపులు

ABN , Publish Date - Jun 03 , 2025 | 02:53 AM

జగన్ పత్రిక జీఎస్టీ వసూళ్లను స్థూల వసూళ్లతో పోల్చి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ నిజానికి నికర జీఎస్టీ ఆదాయం గత ఏడాదితో పోల్చితే 4.49శాతం పెరిగింది, ఇది వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది.

State GST vs Central GST: రాతల్లో నేలచూపులు

  • జీఎస్టీ వసూళ్లపై జగన్‌ పత్రిక వక్రీకరణ

  • స్థూల జీఎస్టీతో పోల్చి వికృతానందం

  • నికర జీఎస్టీయే వృద్ధికి ప్రామాణికం

  • అది గత మే నెలకంటే ఈసారి ఎక్కువే

  • ఈ ఏడాది మే నెలలో వచ్చిన నికర జీఎస్టీ రూ.2714 కోట్లు!

  • గత ఏడాది మే నెలలో రాష్ట్రానికి వచ్చిన నికర జీఎస్టీ ఆదాయం రూ.2597 కోట్లు!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

త ఏడాదికంటే ఈసారి జీఎస్టీ పెరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది! కానీ.. జగన్‌ పత్రిక మాత్రం ‘ఏపీలో జీఎస్టీ నేలచూపులు’ అంటూ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. వృద్ధికి ప్రామాణికంగా తీసుకునే నికర వసూళ్లను కాకుండా, స్థూల వసూళ్లతో పోల్చి... రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కింది. జీఎస్టీ రెండు రకాలు! ఒకటి... స్థూల జీఎస్టీ. రెండోది... నికర జీఎస్టీ. వీటిలో నికర జీఎస్టీని మాత్ర మే వృద్ధికి ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందుకంటే... స్థూల వసూళ్ల నుంచి ఐజీఎస్టీని కేంద్రం మినహాయిస్తుంది. ఐజీఎస్టీ అంటే... అంతర్రాష్ట్ర సరుకు రవాణాపై విధించే పన్ను! దీనిని కేంద్రం సంబంధిత రాష్ట్రాలకు నిష్పత్తి ప్రకారం పంచుతుంది. అంటే... మన రాష్ట్రంలో వసూలైన పన్నుల్లో కొంత ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. అలాగే, ఇతర రాష్ట్రాల్లో వసూలైన పన్నుల్లో మనకూ వాటా లభిస్తుంది. ఈ లెక్కలను కేంద్రమే తేల్చి..ఆయా రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. దీనినే ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ అంటారు. ఈ సెటిల్‌మెంట్‌ తర్వాత వచ్చేదే... నికర జీఎస్టీ. అది మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం. కానీ... జగన్‌ రోత పత్రికలో కొత్తగా ఎస్‌జీఎస్టీ సెటిల్‌మెంట్‌ అని రాసుకొచ్చారు. ఐజీఎస్టీకి, ఎస్‌జీఎస్టీకి తేడా తెలీకుండా రాశారు. ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ 2.23 శాతం తగ్గి రూ.3803 కోట్లకు క్షీణించినట్టు జగన్‌ పత్రిక పేర్కొంది. నిజానికి... ఇవి ఆ నెలకు సంబంధించిన స్థూల వసూళ్లు. ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ తర్వాత నికర జీఎస్టీ రూ.2714 కోట్లు వచ్చింది. అదే గత ఏడాది ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ తర్వాత రూ.2597 కోట్ల నికర జీఎస్టీ వచ్చింది. అంటే... గత ఏడాదికంటే ఈ సారి నికర జీఎస్టీ 4.49ు పెరిగింది. ఇది నిజం! జగన్‌ పత్రిక చెప్పినట్లుగా జీఎస్టీ నేలచూపులు చూడటం అబద్ధం!

Updated Date - Jun 03 , 2025 | 02:55 AM