YSRCP Leaders: అన్నవరం సత్యదేవుని కొండపై రెచ్చిపోయిన వైసీపీ నేతలు
ABN , Publish Date - Aug 02 , 2025 | 09:52 PM
అన్నవరం సత్యదేవుని కొండపై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. దేవస్థానంలో బహిరంగ వేలంలో హెచ్చుపాటదారుడుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. స్వామివారికి అలంకరణ అనంతరం వాడిపోయే పూలను తరలించే కాంట్రాక్టు పనికి ఆలయ అధికారులు బహిరంగ వేలం వేశారు.

కాకినాడ: అన్నవరం సత్యదేవుని కొండపై (Annavaram Satyadevuni Temple) వైసీపీ నాయకులు (YSRCP Leaders) రెచ్చిపోయారు. దేవస్థానంలో బహిరంగ వేలంలో హెచ్చుపాటదారుడుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. స్వామివారికి అలంకరణ అనంతరం వాడిపోయే పూలను తరలించే కాంట్రాక్టు పనికి ఆలయ అధికారులు బహిరంగ వేలం వేశారు. అధిక పాటతో రాజేష్ అనే వ్యాపారి వేలం దక్కించుకున్నారు.
తమకు వేలం దక్కలేదని కొండపై వ్యాపారుల ముసుగులో ఉన్న కొందరు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం దక్కించుకున్న వ్యాపారి రాజేష్‌పై పిడిగుద్దులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. అన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దాడుల్లో గాయపడ్డ వ్యాపారి రాజేష్‌ను తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజేష్‌కు ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్‌బాస్ అరెస్ట్ ఖాయం
Read Latest AP News and National News