Pithapuram in Gas Leak incident: పిఠాపురంలో గ్యాస్ లీక్.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 08:58 PM
ఏపీలోని పిఠాపురంలో ఇవాళ(మంగళవారం) గ్యాస్ లీకైంది. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మల్లం గ్రామంలో మల్లె పాముల వీరనాగేశ్వరరావు ఇంట్లో గ్యాస్ లీకైంది. ఇంట్లో పని చేస్తోండగా అకస్మాత్తుగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి.
కాకినాడ, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): ఏపీలోని పిఠాపురం (Pithapuram)లో ఇవాళ(మంగళవారం) గ్యాస్ లీకైంది (Gas Leak). ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మల్లంగ్రామంలో మల్లె పాముల వీరనాగేశ్వరరావు ఇంట్లో గ్యాస్ లీకైంది. ఇంట్లో పని చేస్తోండగా అకస్మాత్తుగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి.
ఈ సంఘటనలో మల్లిపాముల నాగేశ్వరరావు, అతని భార్య నాగలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నయ్య నాగేశ్వరరావుతో మాట్లాడటానికి వచ్చిన తమ్ముడు లోవరాజుకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమై వెంటనే మంటలు ఆర్పివేశారు. మెరుగైన చికిత్స కోసం బాధితులను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News