Minister Subhash: రీకాల్ బాబు.. ఇది అత్యంత హాస్యాస్పదం.. జగన్‌పై మంత్రి ఫైర్
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:05 PM
Minister Subhash: నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు అంటూ వారికి ఒక రుణం కూడా మంజూరు చేయలేదని జగన్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు గుప్పించారు. ఎస్సీలకు సంబంధించి 26 పథకాలను రద్దు చేసింది జగన్ ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు.

కోనసీమ, జూన్ 28: రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పేరిట వైసీపీ కార్యక్రమం నిర్వహించడం అత్యంత హాస్యాస్పదమని మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Vasamsetti Subhash) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో హామీలు అమలు చేయలేదని విమర్శించారు. సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం, వికలాంగుల పింఛన్ల పెంపు, ప్రత్యేక హోదా, 30 లక్షల ఇళ్ళ నిర్మాణం వంటి హామీలు అమలు చేయలేదన్నారు. జగన్ (Former CM YS Jagan) ఐదేళ్లలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. కమీషన్‌ల కోసం అమర్‌రాజా, కియా వంటి కంపెనీలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారు జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని లేని రాష్ట్రం చేశారన్నారు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు అంటూ వారికి ఒక రుణం కూడా మంజూరు చేయలేదని విమర్శలు గుప్పించారు. ఎస్సీలకు సంబంధించి 26 పథకాలను రద్దు చేసింది జగన్ ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. అనేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు గానీ ఒక్క పైసా కూడా కార్పొరేషన్‌లకు వేయలేదన్నారు. ప్రజలు జగన్‌ను విశ్వసించలేదని.. అందుకే 11 సీట్లకు పరిమితం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ను అంత దారుణంగా చీదరించుకున్నా బుద్దిలేకుండా రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పేరిట వైసీపీ కార్యక్రమం చేపట్టడం దారుణమంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ వాళ్ళ పరిస్థితి నూతిలో కప్పల మాదిరిగా ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలు చేశారు.
క్విట్ పాలిటిక్స్ జగన్: మాజీ మంత్రి గంటా
జగన్ 175 నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల సమావేశంలో అన్నీ అవాస్తవాలే అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former Minister Ganta Srinivas Rao) మండిపడ్డారు. వైసీపీ రీకాల్ బాబు అనే కార్యక్రమానికి తెరలేపారని.. జగన్ రీకాల్ బాబు అంటే ప్రజలు నవ్వుతున్నారంటూ ఎద్దేవా చేశారు. క్విట్ పాలిటిక్స్ జగన్... అనే నినాదాన్ని తాము ఇస్తున్నామన్నారు. అన్యాయానికి, అక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అంటూ దుయ్యబట్టారు. జగన్ రాజకీయాలలో ఉండటానికి అనర్హుడన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలలో 80 శాతం అమలు చేశారని తెలిపారు. జగన్‌కు, వైసీపీ నాయకులకు దమ్ముంటే కూటమి హామీల అమలు , గతంలో వైసీపీ ఇచ్చిన హామీల అమలుపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారన్నారని విమర్శించారు. జగన్ ఇచ్చిన ఏ హామీని వంద శాతం అమలు చేయలేదని అన్నారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామని తెలిపారు. జగన్ కళ్ళు లేని వారిలా ఏదో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి
మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్
Phone Tapping: ఆ మెయిలే పట్టిచ్చింది!
Read Latest AP News And Telugu News