Minister Anitha: స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట: హోంమంత్రి అనిత
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:31 PM
ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందని హోం మంత్రి అనిత ప్రశంసించారు. ఎక్కడ నేరం జరిగినా, ట్రాఫిక్ స్తంభించినా, అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారని అనిత తెలిపారు.

విజయవాడ: మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) పేర్కొన్నారు. నేడు శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత, భరోసా ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మొబైల్ మన చేతిలో ఉంటే.. ప్రపంచం మొత్తం మన చేతిలోనే ఉంటుందని సీఎం చంద్రబాబు చెబుతారని గుర్తుచేశారు. అదే మొబైల్‌ను మనకు రక్షణగా, అస్త్రంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇవాళ(శనివారం) విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష 360 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడారు.
ఆపదలో ఉన్న వారు వాట్సాప్ నెంబర్‌కు ఒక్క మెసేజ్ చేస్తే పోలీసులు వెంటనే అప్రమత్తం అవుతారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. సీసీ కెమెరాల ద్వారా ఏపీలో నేరాల సంఖ్య తగ్గిందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందని ప్రశంసించారు. ఎక్కడ నేరం జరిగినా, ట్రాఫిక్ స్తంభించినా.. అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. నేడు పోలీసింగ్ అనేది ప్రజలకు చాలా చేరువ అవుతుందని తెలిపారు హోంమంత్రి అనిత.
మోడల్ పోలీస్ స్టేషన్‌ను ఎన్టీఆర్ జిల్లా మొత్తం విస్తరించాలని హోంమంత్రి అనిత సూచించారు. సురక్ష యాప్, సురక్ష డివైస్ వల్ల ప్రజలకు ఎంతో మంచి జరుగుతోందని ఉద్ఘాటించారు. ఏపీలో ఇటీవల ఆన్‌లైన్ మోసాలు కూడా బాగా పెరిగాయని చెప్పారు. ప్రజలు కూడా అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని కోరారు. ఇలాంటి మోసాలను కూడా అరికట్టేందుకు టెక్నాలజీ ద్వారా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ప్రజల భద్రత కోసం ఏపీ పోలీస్‌శాఖ, తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. స్మార్ట్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో వీఐపీ, వీవీఐపీలు ఎక్కువగా ఉంటే భద్రత చాలా అవసరమని తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగిన అడ్డుకట్ట వేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Puri Rath Yatra: జగన్నాథుని రథయాత్రలో అపశృతి.. 500 మందికి పైగా గాయాలు
Phone Tapping: ఆ మెయిలే పట్టిచ్చింది!
Read Latest AP News And Telugu News