Konaseema District Accident: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం.. అయ్యప్ప స్వాములకి తీవ్రగాయాలు
ABN , Publish Date - Nov 02 , 2025 | 03:34 PM
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బొలెరో వ్యాన్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District) కొత్తపేట మండలం గంటి సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బొలెరో వ్యాన్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన 14 మంది అయ్యప్ప స్వాములు వారి కుటుంబ సభ్యులతో అంతర్వేది ఆలయానికి బయలు దేరారు.
ఈ సమయంలో ప్రమాదవశాత్తూ బొలెరో వ్యాన్ పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప స్వాములకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గురైన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగ్రాతులకి ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో దారుణం.. మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన
నేను అభివృద్ధి చేస్తుంటే.. వాళ్లు విధ్వంసం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News