Share News

Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్

ABN , Publish Date - Apr 17 , 2025 | 09:42 AM

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసుల సూచించారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి కూటమి ప్రజా ప్రతినిధులు.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సవాళ్లపై పోలీసు శాఖ గురువారం ఈ ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు.

Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్
Palla Srinivas vs Bhumana Karunakar Reddy

తిరుపతి: తిరుమల గోశాల (TTD Gosala) వద్దకు గురువారం వైసీపీ నేత (YCP Leader) భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (TDP Leader Palla Srinivas) సవాల్ (Challenge) విసిరారు. ప్రతి సవాళ్లతో తిరుపతి (Tirupati)లో ఉద్రిక్త (Tension) వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలతో శాంతి ర్యాలీ నిర్వహించి కరుణాకర్ రెడ్డి చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కూటమి నేతలు పిలుపిచ్చారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వారి పీఏలు, గన్ మేన్‌లు మాత్రం గోశాల వద్దకు రావచ్చని, శాంతి భద్రతలకు విఘాతం కల్పించవద్దని ప్రభుత్వ అధికారులు కోరారు. దీంతో మంత్రులు, ప్రజా ప్రతినిధులు గోశాల సందర్శన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కూటమి నేతలు మార్చుకున్నారు. గత ప్రభుత్వంలా వ్యవహరించకుండా, ప్రజాస్వామ్యయుతంగానే పాలన అందించాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఒకే సమయంలో అధికార, ప్రతిపక్షాలు గోశాల సందర్శనకు వద్దని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు సూచించారు. ఎవరినీ గృహ నిర్భందం చేయలేదని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా గోశాలను ఏ పార్టీ నేతలైనా సందర్శించవచ్చునని ఆయన అన్నారు.

Also Read..: జైకా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ..


గుంపులుగా గోశాలకు రావద్దు..

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసుల సూచించారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి కూటమి ప్రజా ప్రతినిధులు.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సవాళ్లపై పోలీసు శాఖ గురువారం ఈ ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు. శాంతి ర్యాలీ పేరుతో వందలాది కార్యకర్తలతో కాకుండా గన్ మెన్ లతో‌ గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడవచ్చని కూటమి ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా టీటీడీ గోశాలల్లో మూగ జీవాల మృతిపై రాజకీయ రగడ జరుగుతోంది. వైసీపీ , కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గోశాలలో ఘోరాలు జరుగుతున్నాయంటూ గొంతు చించుకున్న ఫ్యాన్ పార్టీ నేతలకు టీటీడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో నోరు పెగలని పరిస్థితి. ఆవుల మృతిని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నించిన వైసీపీ చివరకు అబాసుపాలైంది. గత పాలక మండలి నిర్వాహకాలపై విజిలెన్స్ నివేదికలోని అంశాలను గత వైసీపీ ప్రభుత్వం తొక్కి పెట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల తూటాలు

16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. (ఫోటో గ్యాలరీ)

For More AP News and Telugu News

Updated Date - Apr 17 , 2025 | 10:19 AM