Share News

Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. విచారణకు హాజరైన ధర్మారెడ్డి

ABN , Publish Date - Nov 11 , 2025 | 03:27 PM

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. విచారణకు హాజరైన ధర్మారెడ్డి
Tirupati Laddu Case

తిరుపతి, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసు (Tirumala Laddu Case)లో సిట్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారణకు ఈరోజు(మంగళవారం) పిలిచింది. సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని గంటలుగా ధర్మారెడ్డిని సీబీఐ డీఐజీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు ధర్మారెడ్డిని విచారించనున్నారు సిట్ అధికారులు.


మళ్లీ రేపు(బుధవారం) కూడా ధర్మారెడ్డిని విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే, సిట్ విచారణ నుంచి బయటకు వెళ్లారు ధర్మారెడ్డి. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడటానికి ఆయన వచ్చారు. ఆ సమయంలో ధర్మారెడ్డికి శ్రీవారి లడ్డూ ఇచ్చేందుకు ప్రయత్నించారు జనసేన నేత కిరణ్ రాయల్. అయితే, కిరణ్ రాయల్ శ్రీవారి లడ్డూని ధర్మారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేయగా లడ్డూ తీసుకోకుండా అక్కడ నుంచి ఆయన వెళ్లినట్లు సమాచారం.


సుబ్బా రెడ్డికి సీబీఐ అధికారుల నోటీసులు

మరోవైపు.. కల్తీ నెయ్యి కేసులో విచారణకు హాజరు కావాలని టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బా రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 13వ తేదీన లేకపోతే 15వ తేదీన హాజరవుతానని సమాధానం ఇచ్చారు సుబ్బారెడ్డి. తాను లక్నోకు వెళ్తున్నందున 15వ తేదీన విచారణకు హాజరవుతానని సుబ్బారెడ్డి సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేశారు.. మౌలానా ఆజాద్‌కి నివాళి అర్పించిన చంద్రబాబు, లోకేష్

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 11 , 2025 | 03:42 PM