AP GOVT: ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి.. పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:49 PM
Pawan Kalyan: తిరుపతి జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో మృతిచెందారు. ఈ ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

తిరుపతి: తిరుపతి జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన 72 ఏళ్ల ఆర్.సిద్ధయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో దుర్మరణం చెందాడు. సిద్దయ్య మృతికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. కుటుంబ పెద్దను పోగొట్టుకున్న వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఏనుగుల సంచారాన్ని, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు వన్యప్రాణుల నుంచి ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు
ఆ ఘటన తెలిసి ఆవేదన చెందాను: పవన్ కల్యాణ్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అవిడి గ్రామం వద్ద ఈ రోజు చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది మహిళ ఉపాధి హామీ శ్రామికులు గాయాల పాలైన ఘటన తెలిసి ఆవేదన చెందానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తక్షణమే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గాయపడిన వారికి చికిత్స అందించడంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతలను ఒక అధికారికి అప్పగించాలని అన్నారు. జిల్లా యంత్రాంగం పరిశీలించి, ఆర్థిక సహాయం అందించే చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను పవన్ కల్యాణ్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Veerayya Chowdary: మూడు మాఫియాల పగ
YS Sharmila: బీజేపీ విధానాలతోనే దేశంలో ఉగ్రవాదం
Heatwave: ఎండ తీవ్రత.. వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి
Read Latest AP News And Telugu News