Share News

Pawan Kalyan: ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్

ABN , Publish Date - Jul 29 , 2025 | 07:11 PM

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఏనుగుల గుంపు తిరుగుతూ పొలాలు ధ్వంసం చేసిన ఘటనను అధికారులు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు వివరించారు.

Pawan Kalyan: ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు..  పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Pawan Kalyan

అమరావతి: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇవాళ(మంగళవారం జులై 29) రాష్ట్ర సచివాలయంలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఏనుగుల గుంపు తిరుగుతూ పొలాలు ధ్వంసం చేసిన ఘటనను  అధికారులు డిప్యూటీ సీఎం పవన్‌  కల్యాణ్‌కు వివరించారు. డ్రోన్ ద్వారా ఏనుగుల గుంపు కదలికలను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


ఏనుగులు ఎటువైపు వెళ్తున్నాయనేది పరిశీలించడానికి డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తున్న క్రమంలో... అవి వెళ్లే అవకాశం ఉన్న మార్గాల్లోని గ్రామాలవారిని అప్రమత్తం చేయడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాటికి ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు పంపించాలని దిశానిర్దేశం చేశారు. ఏనుగుల కదలికలు, హెచ్చరిక సందేశాలు పంపించడాన్ని డీఎఫ్ఓ. కార్యాలయాలు, పీసీసీఎఫ్. కార్యాలయం పర్యవేక్షించాలని ఆదేశించారు. వీటితోపాటు ఏనుగుల గుంపు పొలాల మీదకి రాకుండా, అటవీ ప్రాంతంలోకి పంపించే చర్యలను పకడ్బందీగా చేపట్టాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్.. షర్మిలకు షాక్!

పెన్సిల్‌ ముల్లుపై వైట్‌హౌస్‌.. ట్రంప్‌ ప్రశంసలు

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 29 , 2025 | 07:59 PM