YSRCP: వైసీపీలో అయోమయం..!
ABN , Publish Date - Jul 15 , 2025 | 09:55 AM
నియోజకవర్గంలో వైసీపీకి సమన్వయకర్తలేక కార్యకర్తల్లో అయోమయం ఏర్పడింది. పార్టీ కార్యక్రమాలు చేపట్టేవారు లేరు, సమస్య వస్తే అండగా నిలిచేవారూ కరువయ్యారు. దీంతో వైసీపీ క్యాడర్ బలహీనపడుతోందని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

తాడిపత్రిలో సమన్వయకర్త లేమి
దిక్కుతోచని స్థితిలో కార్యకర్తలు
వర్గాలుగా పార్టీ కార్యక్రమాలు
తాడిపత్రి, జూలై14(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో వైసీపీకి (YSRCP) సమన్వయకర్తలేక కార్యకర్తల్లో అయోమయం ఏర్పడింది. పార్టీ కార్యక్రమాలు చేపట్టేవారు లేరు, సమస్య వస్తే అండగా నిలిచేవారూ కరువయ్యారు. దీంతో వైసీపీ క్యాడర్ బలహీనపడుతోందని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏడాదిన్నరగా సమన్వయకర్త లేకపోవడంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత పార్టీ సమన్వయకర్తను నియమించలేదు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి రాలేని పరిస్థితి ఏర్పడింది. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తే అడ్డుకుని తీరతామంటూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డితోపాటు కౌన్సిలర్లు, కార్యకర్తలు ఇప్పటికే పలుసార్లు బహిరంగంగా ప్రకటించారు. అడ్డుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం కష్టమేనని రాజకీయ పండితులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీలో వర్గాలు ఏర్పడ్డాయి. పెద్దారెడ్డి, రమే్‌షరెడ్డి, ఫయాజ్‌బాషా వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమన్వయకర్తగా ఎవరిని నియమిస్తారన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమే్‌షరెడ్డి కలవడంతో ఆయనకే సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. ముస్లిం నాయకుడు ఫయాజ్‌బాషాకు ఇస్తారన్న వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని సమన్వయకర్తగా నియమించినా.. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎదురొడ్డి పార్టీని నడిపించగలరా అన్న సందేహాలు ఏర్పడ్డాయి.
పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లికే పరిమితం అవడంతో తాడిపత్రిలో తమకు ఇబ్బంది తలెత్తితే ఎవరు అండగా నిలుస్తారని కార్యకర్తలు వాపోతున్నారు. రమే్‌షరెడ్డి ఉన్నా.. ఆయన కార్యక్రమాలకు హాజరవడం, మాట్లాడడం వరకే పరిమితమవుతున్నారన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డితోపాటు మరికొంతమంది నాయకుల ద్వారా రమే్‌షరెడ్డి సమన్వయకర్త పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ఇప్పటికే సమన్వయకర్తగా రమే్‌షరెడ్డి పేరు ఖరారైందనీ, రేపో.. మాపో.. ప్రకటిస్తారన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ర్యాంకర్లను సన్మానించిన మంత్రి లోకేశ్
ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు గవర్నర్లు
Read Latest AP News And Telugu News