YSRCP Leader: రెచ్చిపోయిన వైసీపీ నేత.. ఏం చేశారంటే..
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:46 PM
అనంతపురంలో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి హల్‌చల్ చేశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ను ధ్వంసం చేయించారు. ఆస్పత్రిని అప్పగించాలని దాదాపు 30 మంది రౌడీమూకలతో బాధితురాలు, మహిళ లాయర్ శ్రీలత బెదిరించినట్లు తెలుస్తోంది.
అనంతపురం,నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అనంతపురం పట్టణంలో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి (YSRCP Leader Satyanarayana Reddy) హల్‌చల్ చేశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ను ఆయన ధ్వంసం చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రిని అప్పగించాలని దాదాపు 30 మంది రౌడీమూకలతో బాధితురాలు, మహిళ లాయర్ శ్రీలతను సత్యనారాయణ రెడ్డి బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆస్పత్రిని ఆయన తన అనుచరులతో ధ్వంసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హాస్పిటల్లోని సీసీ కెమెరాలు పగలగొట్టి ఫర్నిచర్, ఏసీలు, ఐసీయూ అద్దాలు, లిఫ్ట్‌ను పూర్తిగా ధ్వంసం చేశారని ప్రచారం జరుగుతోంది.
వైసీపీ మూకల దాడితో దాదాపు రూ.3 కోట్లు నష్టం వచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు బాధితురాలు, మహిళ లాయర్ శ్రీలత. అయితే, సాయినగర్‌లోని మూడో క్రాస్‌లో నూతనంగా నిర్మించిన హాస్పిటల్లో భాగస్వాములుగా ఉన్నారు శ్రీనివాసులు, రాఘవేంద్ర రెడ్డి, లాయర్ శ్రీలత, వైసీపీ నేత, లాయర్ సత్యనారాయణ రెడ్డి. సదరు హాస్పిటల్ నిర్మించిన తర్వాత తనకే అప్పగించాలని భాగస్వాములపై బెదిరింపులకు సత్యనారాయణ రెడ్డి దిగినట్లు సమాచారం. మరో మూడు రోజుల్లో హాస్పిటల్ ప్రారంభిస్తున్నామని.. ఈ సమయంలో హాస్పిటల్‌ను ధ్వంసం చేశారని బాధితురాలు, మహిళ లాయర్ శ్రీలత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సత్యనారాయణ రెడ్డిపై బాధితురాలు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News