Kadiri Municipal: కదిరి మున్సిపాల్ చైర్ పర్సన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
ABN , Publish Date - Apr 23 , 2025 | 07:57 AM
Kadiri Municipal Chairperson: కదిరి మున్సిపాల్టీలో అవిశ్వాస సెగ రాజుకుంది. కౌన్సిలర్లు ఇవాళ మన్సిపాల్ చైర్ పర్సన్ నజిమున్నీసపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమయ్యారు. దీంతో కదిరి రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్ నజిమున్నీసాపై ఇవాళ(బుధవారం) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్ అవిశ్వాస తీర్మానం కొనసాగుతోంది. మున్సిపల్ చైర్ పర్సన్ నజిమున్నీసాపై మెజార్టీ వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కదిరి మున్సిపాలిటీలో వైసీపీ-30, టీడీపీ-05 స్వతంత్ర అభ్యర్థి-01 కౌన్సిలర్లు ఉన్నారు.
వైసీపీకి ఉన్న 30 మంది కౌన్సిలర్లలో సార్వత్రిక ఎన్నికల ముందు 6మంది వైసీపీ కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు టీడీపీలో చేరారు. వైసీపీ కౌన్సిలర్ల చేరికతో టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య 12 మందికి చేరింది. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం కోరుతూ మరో 14 మంది వైసీపీ కౌన్సిలర్లు ముందుకువచ్చారు. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి 36 మంది కౌన్సిలర్లకు గాను 26 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. బెంగుళూరు క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి 14 మంది వైసీపీ కౌన్సిలర్లు చేరుకున్నారు.
కదిరిలో హై టెన్షన్...
కదిరి మున్సిపల్ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కదిరి పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య కదిరి మున్సిపల్ చైర్‌పర్సన్ అవిశ్వాస తీర్మానం కొనసాగుతోంది. మున్సిపల్ చైర్‌పర్సన్ నజిమున్నీసాపై మెజార్టీ వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి 36 మంది కౌన్సిలర్లకు గాను 26 మంది కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. బెంగుళూరు క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి 14 మంది వైసీపీ కౌన్సిలర్లు వచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Andhra Pradesh Liquor Scam: జగన్ చెప్పారు.. నేను చేశాను!
PSR Anjaneyulu: అరెస్టు చేసినా అదే బాసిజం
Chandrababu Naidu: కేంద్రమంత్రి మేఘవాల్ ఇంట్లో ‘సైకిల్’పై చర్చ
Heatwave: ఎండదెబ్బకు ఒక్క ప్రాణమూ పోకూడదు
Read Latest AP News And Telugu News