AP NEWS: బాబోయ్.. ఎలుకలు ఎంత పనిచేశాయ్..
ABN , Publish Date - Apr 26 , 2025 | 09:52 AM
Rats Bite in Anantapur students: అనంతపురంలోని ఓ వసతి గృహంలో ఉండే విద్యార్థులు ఎలుకలు అంటేనే భయపడుతున్నారు. ఎక్కడ దాడి చేస్తాయోనని హడలిపోతున్నారు. హాస్టల్‌లో పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతోనే ఈ ఎలుకలు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.

అనంతపురం: అనంతపురంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల వసతి గృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. ఎలుకల దాడిలో పదిమంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గోప్యంగా కళాశాల ప్రిన్సిపాల్ ఉంచారు. ఎలుకల దాడిలో గాయపడిన విద్యార్థినులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించారు. కళాశాల వసతి గృహంలో విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో ఈ ఎలుకలు కొరికినట్లు తెలుస్తోంది.
హాస్టల్ చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో రూమ్‌లోకి ఎలుకలు వస్తున్నాయని విద్యార్థినులు అంటున్నారు. నిర్మాణంలోని హాస్టల్ భవనంలో ఎలుకల బెడద ఉందని విద్యార్థినులు చెబుతున్నారు. ఈ విషయం తెలియడంతో వెంటనే హాస్టల్ రూములు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించామని కాలేజీ యాజమాన్యం తెలిపారు. విద్యార్థినులు బయట నుంచి రూమ్‌లోకి స్నాక్స్ తీసుకొని రావడం వల్ల కూడా ఎలుకలు వస్తున్నాయని హాస్టల్ వార్డెన్ సౌగంధిక తెలిపారు.
అయితే విద్యార్థినుల తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో హాస్టల్ నిర్వాహకులను ప్రశ్నించారు. ఇక ముందు ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని హాస్టల్ వార్డెన్ సౌగంధిక తెలిపారు. అయితే.. కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో 1200 వందల మంది విద్యార్థినులు చదువుతున్నారు. అనంతపురంలో ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ఇది ఒక్కటి మాత్రమే ఉంది. ఈ కళాశాలలో ఏపీ ప్రభుత్వం అన్ని వసతులు కల్పించింది. ఈ కాలేజీకి న్యాక్ గుర్తింపు కూడా లభించింది.
గతంలో విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ భోజనం తిన్న విద్యార్థులు పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంలో విద్యార్థులు ఆందోళనలు కూడా చేశారు. ఏపీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అడప దడప ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా హాస్టల్ నిర్వాహకులు నిర్లక్ష్యాన్ని వీడి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Veerayya Chowdary: మూడు మాఫియాల పగ
YS Sharmila: బీజేపీ విధానాలతోనే దేశంలో ఉగ్రవాదం
Heatwave: ఎండ తీవ్రత.. వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి
Read Latest AP News And Telugu News