Share News

Nandamuri Balakrishna: హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా: నందమూరి బాలకృష్ణ

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:42 PM

హిందూపురం అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు.

Nandamuri Balakrishna: హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా: నందమూరి బాలకృష్ణ
Nandamuri Balakrishna

శ్రీ సత్యసాయి జిల్లా, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యానించారు. ఇవాళ(ఆదివారం) హిందూపురం మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.


తనను మూడుసార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటానని బాలకృష్ణ తెలిపారు. హిందూపురం ప్రాంతంలో కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతీయువకులను ఆదుకుంటానని భరోసా కల్పించారు. ఏపీ మంత్రులంతా హిందూపురం అభివృద్ధిపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు.


కాగా, హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండోరోజు పర్యటించారు. హిందూపురం మండలం మలుగూరులో రూ.26.5 లక్షల వ్యయంతో నిర్మించిన పశువుల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు. అలాగే, వాల్మీకి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు బాలకృష్ణకి ఘనంగా స్వాగతం పలికి.. తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బాలకృష్ణ వేదపండితుల ఆశీర్వచనం పొందారు.


అలాగే, హిందూపురం మున్సిపాలిటీలో రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులకు సంబంధించి బాలాజీ సర్కిల్‌లో పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం కనకదాసు జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముద్దిరెడ్డిపల్లిలో చౌడేశ్వరి కల్యాణ మండపంలో హ్యాండ్ లూమ్స్, టెక్స్‌టైల్స్ వారి ఆధ్వర్యంలో సబ్సిడీ కింద మంజూరైన చేనేత పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్

టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 16 , 2025 | 03:17 PM