Share News

Minister Payyavula Keshav: ఏపీలో ఎక్కడా లేని విధంగా ఆ ప్రాజెక్ట్‌ పూర్తి చేశాం: మంత్రి పయ్యావుల

ABN , Publish Date - Jul 07 , 2025 | 01:34 PM

ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా ఆరునెలల్లో తాగునీటి ప్రాజెక్ట్‌ పూర్తి చేశామని పేర్కొన్నారు.

Minister Payyavula Keshav: ఏపీలో ఎక్కడా లేని విధంగా  ఆ ప్రాజెక్ట్‌ పూర్తి చేశాం: మంత్రి పయ్యావుల
Minister Payyavula Keshav

అనంతపురం: ఏపీలో ఎక్కడా లేని విధంగా ఆరునెలల్లోనే తాగునీటి ప్రాజెక్ట్‌ పూర్తి చేశామని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) వ్యాఖ్యానించారు. ఇవాళ(సోమవారం) అనంతపురంలోని ఉరవకొండలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. ఉరవకొండ పట్టణానికి తాగునీరు అందించేందుకు జనవరి ఒకటోవ తేదీన తాగునీటి పైప్‌లైన్ పనులు ప్రారంభించామని గుర్తుచేశారు మంత్రి పయ్యావుల కేశవ్.


నేడు పనులు పూర్తి చేసి ప్రాజెక్ట్‌ని ప్రారంభించామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రూ.22కోట్లతో కేవలం ఆరునెలల్లోనే తాగునీటి ప్రాజెక్ట్ పూర్తిచేశామని తెలిపారు. ఆరోజే తాను చెప్పానని.. తనను గెలిపించిన ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని అన్నారు. ఈ రోజు ఏన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపించానని చెప్పుకొచ్చారు. వైసీపీ నేత వై. విశ్వేశ్వర్ రెడ్డి ‍ఒక అసమర్థుడని చెప్పడానికి ఇదే నిదర్శనమని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు.


ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలి: ప్రత్తిపాటి పుల్లారావు

Pulla-Rao.jpg

కూటమి నాయకులు ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలని మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ఏడాదిలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఇవాళ(సోమవారం) పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలం ఇర్లపాడులో కీ.శే. వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా మీడియాతో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. వంగవీటి రంగా ఒక్క కులానికి పరిమితం కాదని.. ఆయన పేదల మనిషి అని కొనియాడారు. వంగవీటి రాధాకృష్ణ ప్రజాహితం కాంక్షించే నిస్వార్థ నాయకులని ప్రశంసించారు. ప్రజలకోసం, కూటమి ప్రభుత్వ పక్షాన వంగవీటి రాధాకృష్ణ నిలబడ్డారని చెప్పుకొచ్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మద్దతు.. బీజేపీ సహకారంతోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఏపీ భివృద్ధికి చంద్రబాబు నాయకత్వమే కీలకమన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిణితికి నిదర్శనమని ప్రత్తిపాటి పుల్లారావు ఉద్ఘాటించారు.


ఈ వార్తలు కూడా చదవండి

మామిడి కొనుగోలుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Read latest AP News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 02:38 PM