Anantapur Lecturer Blackmail Case: మాస్టారూ.. మీడియాకు చెప్తా..!
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:22 AM
చదువులకు సాయం చేసిన మాస్టారునే టార్గెట్ చేసింది ఓ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం ప్రారంభించింది. టార్చర్ భరించలేక మాస్టారు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు అండగా నిలబడి పోలీసుల వద్దకు తీసుకెళ్లారు.

గురువుకు చుక్కలు చూపిన శిష్యురాలు
బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బులు గుంజిన విద్యార్థిని
సుందర కాండలో క్రైమ్ స్టోరీ!
అనంతపురం క్రైం, జూలై 22(ఆంధ్రజ్యోతి): చదువులకు సాయం చేసిన మాస్టారునే టార్గెట్ చేసింది ఓ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి బ్లాక్‌మెయిల్ (Blackmail Case) చేసి డబ్బులు గుంజడం ప్రారంభించింది. టార్చర్ భరించలేక మాస్టారు (College Lecturer) ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు అండగా నిలబడి పోలీసుల వద్దకు తీసుకెళ్లారు. వారు వలవేసి ఇన్నింగ్ స్టూడెంట్‌ని, ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగరంలోని ఓ పోలీస్ స్టేషన్. పరిధిలో కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారం మంగళవారం క్లైమాక్స్‌కి చేరుకుంది. బాధిత మాస్టార్ స్నేహితులు తెలిపిన మేరకు, నగరంలోని కాలేజీలో చదివే విద్యార్థినికి ఓ టెక్చరర్ అండగా నిలిచారు. కొన్నేళ్ల నుంచి ఆర్థిక సాయం చేస్తున్నారు. బాగా చదువుకునేందుకు పలు సూచనలూ చేశారు. ఫీజు కట్టేందుకు ఇబ్బందిగా ఉంది అంటే. ఇటీవల రూ.25 వేలు ఇచ్చారు.
మాస్టార్ ఉదారత గురించి తెలుసుకున్న ఆ విద్యార్థిని బాయ్ ప్రెండ్.. మరింత డబ్బు గుంజేందుకు ప్లాన్ చేశాడు. దీనికోసం సానుభూతి కోణాన్ని కాకుండా, బ్లాక్‌మెయిల్ చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఆ లెక్చరర్‌కి ఫోన్ చేసిన విద్యార్థిని బాయ్ ఫ్రెండ్, 'అసభ్యంగా ప్రవరిస్తున్నారట. వేధిస్తున్నారట అని బెదిరించాడు. తాను అలాంటివాడిని కాదని లెక్చరర్ వాపోతే.. విద్యార్థినిని కాన్ఫరెన్స్‌లోకి తీసుకుని, ప్లాన్ ప్రకారం ఆరోపణలు చేయించాడు. కాల్ రికార్డు చేశామని, మీడియాకు ఇస్తామని బెదిరించాడు. దీంతో లెక్చరర్ బెంబేలెత్తిపోయారు. ఇదే అదనుగా డబ్బులు గుంజడం ప్రారంభించారు విడతలవారీగా సుమారు రూ.1.50 లక్ష లాగేశారు. ఇటీవల ఫోన్ చేసి రూ.1.50 లక్షలు ఇవ్వాలని బెదిరించారు.
తాను ఆస్పత్రి వద్ద ఉన్నానని, తన కుమారుడి ఆరోగ్యం బాగాలేదని, తనవద్ద అంత డబ్బు లేదని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో దిక్కుతోచని మాస్టార్ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు, తప్పు చేయనప్పుడు భయపడటం దేనికని.. పోలీసుల వద్దకు తీసుకెళ్లారు. నిజమేమిటో నిర్ధారించుకునేందుకు పోలీసులు ఓ సూచన చేశారు. 'అడిగిన డబ్బులు ఇస్తామని పిలిచి డబ్బులు ఇవ్వండి. మేం వచ్చి పట్టుకుంటాం." అని బాధితుడికి సూచించారు. మాస్టార్ అలాగే చేశారు. మఫ్టీలో ఉన్న పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 'ఎందుకిలా చేశావ్.? సాయం చేసిన గురువుకే పంగనామాలా..? అని పోలీసులు నిలదీస్తే, సారు మీకు ఫిర్యాదు చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదు సర్ అని అందట శిష్యురాలు పోలీసులు విచారిస్తున్నాడు. కానీ, జరిగిన సంఘటనను ధ్రువీకరించడం లేదు. గురువు క్షమించి వదిలేస్తారా..? లేక కిలాడీ శిష్యురాలు కాళ్లావేళ్లా పడి బయటపడతారా..? అనేది తేలాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
వచ్చే 3 రోజులు అతి భారీ వర్షాలు
Read latest AP News And Telugu News