AP POLICE: ఏపీ పోలీసుల మెరుపు ఆపరేషన్.. అంతర్జాతీయ సైబర్ మాఫియా అరెస్ట్
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:11 PM
దేశ సరిహద్దులు దాటి సైబర్ నేరగాళ్లను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కాంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్‌లని ఆపరేట్ చేస్తున్న నేరగాళ్లను పోలీసులు గుర్తించారు. రాయదుర్గంకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అకౌంట్ నుంచి రూ.1.74కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టామని అనంతపురం ఎస్పీ జగదీష్ తెలిపారు.

అనంతపురం: దేశ సరిహద్దులు దాటి సైబర్ నేరగాళ్లను (Cyber Criminals) అనంతపురం జిల్లా పోలీసులు (Anantapur District Police) పట్టుకున్నారు. కాంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్‌లని ఆపరేట్ చేస్తున్న నేరగాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అనంతపురం ఎస్పీ జగదీష్ ఇవాళ(శుక్రవారం) మీడియాకు వివరాలు వెల్లడించారు. రాయదుర్గంకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అకౌంట్ నుంచి రూ.1.74కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టామని తెలిపారు అనంతపురం ఎస్పీ జగదీష్.
ఢిల్లీ కేంద్రంగా ఫేక్ అకౌంట్ల ద్వారా పలు అకౌంట్లలోకి సైబర్ క్రిమినల్స్ డబ్బు మార్పిడి చేశారని అనంతపురం ఎస్పీ జగదీష్ అన్నారు. ఈ కేస్‌ను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టామని చెప్పుకొచ్చారు. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుమంది సైబర్ నేరగాళ్లని అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల దగ్గరి నుంచి 8 సెల్‌ఫోన్‌లు, కారు, 20 ఏటీఎం కార్డ్స్, 15 సిమ్‌కార్డ్స్, 5 బ్యాంక్ పాస్ బుక్కులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా క్రియేట్ చేసిన 13 ఫేక్ అకౌంట్లలోకి డబ్బులు వెళ్లినట్లు గుర్తించామని చెప్పుకొచ్చారు. క్రిప్టో కరెన్సీ ద్వారా పైసలను దేశం దాటించేందుకు సైబర్ క్రిమినల్స్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కాంబోడియా దేశం నుంచి నేరగాళ్లు మొత్తం నెట్‌వర్క్‌ని ఆపరేట్ చేస్తున్నారని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోవూరులో ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పాలంటూ మహిళల డిమాండ్
For More AP News and Telugu News