Home » Vijaywada West
రైలు ఎక్కారు.. నిఘా పెట్టారు. అందరూ నిద్రపోయిన వెంటనే పని మొదలు పెట్టారు. ఇలా డబ్బు బ్యాగ్‌తో ఉడాయించిన కేటుగాళ్లను విజయవాడ పోలీసులు టెక్నాలజీ సాయంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి నగదును రికవరీ చేశారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు, రేపు విజయవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. ఈ మేరకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Ram Charan Cutout: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తులో భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. 'గేమ్ ఛేంజర్' చిత్రంలో ఉన్న స్టిల్‌తో ఈ కటౌట్ రూపొందించారు. వజ్రా గ్రౌండ్స్‌లో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ ఆవిష్కరించనున్నారు. ఈ కటౌట్‌ను చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. అభిమానులతో వజ్రా గ్రౌండ్స్ కోలాహలంగా మారింది.
విజయవాడ అభివృద్దికి సంబంధించి అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్ధేశం చేశారు. నగరంలో పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా జరిగేలా ట్యాంకుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కరుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల వాసులు బిక్కుబిక్కుమంటు ఉంటున్నారు.
విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ మదర్సాలో ఫుడ్ పాయిజన్ జరిగడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 10 మందికి వాంతులయ్యాయి.
ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) వైసీపీ(YSRCP)లోకి వెళ్లిన తర్వాత మరీ తన స్థాయికి దిగజార్చుకుని మాట్లాడుతున్నారని విజయవాడ పశ్చిమ బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి(Sujana Chowdary) అన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలపై సుజనా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని స్థాయికి దిగిజారి తాను మాట్లాడలేనని అన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన - బీజేపీ (Telugu Desam - Janasena - BJP) పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో వేగం పెంచాయి. పొత్తులో భాగంగా అభ్యర్థులను ప్రకటిస్తూ టీడీపీ - జనసేన దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే రెండు జాబితాలను ఈ రెండు పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే.
విజయవాడలో మరోసారి వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోయారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ నేతలపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ఓ కేసు వాయిదా కోసం కోర్టుకు గన్నవరం టీడీపీ (TDP), వైసీపీ నేతలు వచ్చారు. ఈ సమయంలో వైసీపీ నేతలు కోర్టు ఆవరణలో అలజడి సృష్టించారు.
నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి (ఇంద్రకీలాద్రి) 8వ పాలకమండలి సమావేశం సోమవారం నాడు జరిగింది. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశానికి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ రామారావు హాజరయ్యారు.