Share News

E-Passports: ఈ-పా్‌సపోర్టుతో నకిలీలకు చెక్‌ డేటా భద్రం

ABN , Publish Date - Jun 27 , 2025 | 03:57 AM

పాస్‌పోర్ట్‌ సేవా వెర్షన్‌ 2.0 కింద ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తున్నాం. వీటిద్వారా పాస్‌పోర్టుల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేశాం అని పాస్‌పోర్టు ప్రాంతీయ అధికారి(ఆర్‌పీవో) శివహర్ష వెల్లడించారు.

E-Passports: ఈ-పా్‌సపోర్టుతో నకిలీలకు చెక్‌ డేటా భద్రం

  • పాస్‌పోర్టు సేవలకుగాను రాష్ట్రానికి మూడు అవార్డులు

విజయవాడ, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ‘పాస్‌పోర్ట్‌ సేవా వెర్షన్‌ 2.0 కింద ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తున్నాం. వీటిద్వారా పాస్‌పోర్టుల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేశాం’ అని పాస్‌పోర్టు ప్రాంతీయ అధికారి(ఆర్‌పీవో) శివహర్ష వెల్లడించారు. విజయవాడలోని రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఈ-పా్‌సపోర్టులో ఎలక్ర్టానిక్‌ చిప్‌, డిజిటల్‌ సంతకం ఉంటుంది. వ్యక్తిగత సమాచార భద్రతకు ఉపయోగపడుతుంది. నకిలీ పాస్‌పోర్టుల తయారీని అరికట్టవచ్చు. పాస్‌పోర్టుల విషయంలో దళారీలను నమ్మి మోసపోవద్దు. ఇప్పుడు వారంలోపే పాస్‌పోర్టు జారీ చేస్తున్నాం. ఉన్నవాటి స్థానంలో కొత్తగా ఈ-పా్‌సపోర్టులను జారీ చేస్తున్నాం. కాలపరిమితి ఉన్నంతవరకు పాత వాటిని అనుమతిస్తాం. రెన్యువల్‌ సమయంలో ఈ-పా్‌సపోర్టులను జారీ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా జారీ అయ్యే పాస్‌పోర్టుల సంఖ్య పెరిగింది’ అని శివహర్ష తెలిపారు.

ఉత్తమ సేవలకు గుర్తింపు

రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవల్లో ఉత్తమ సేవలందించినందుకు మూడు విభాగాలకు అవార్డులు వచ్చాయని శివహర్ష తెలిపారు. పాస్‌పోర్టు తనిఖీలో ఉత్తమ పోలీ్‌సశాఖ విభాగంలో రాష్ట్ర పోలీసు శాఖకు, ఉత్తమ పోస్ట్‌ ఆఫీస్‌ పాస్‌పోర్టు సేవాకేంద్రం విభాగంలో గుంటూరు పోస్టాఫీసుకు, ఉత్తమ పాస్‌పోర్టు అధికారి విభాగంలో తనకూ అవార్డులు వచ్చాయని శివహర్ష వెల్లడించారు.

Updated Date - Jun 27 , 2025 | 03:57 AM