Share News

Vijayawada: విజయవాడలో 200 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:46 AM

ఏవోబీలో కొనుగోలు చేసిన గంజాయిని తమిళనాడు తరలిస్తుండగా ఈగల్‌ బృందాలు పట్టుకున్నాయి.

Vijayawada: విజయవాడలో 200 కిలోల గంజాయి స్వాధీనం

విజయవాడ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఏవోబీలో కొనుగోలు చేసిన గంజాయిని తమిళనాడు తరలిస్తుండగా ఈగల్‌ బృందాలు పట్టుకున్నాయి. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, 200 కిలోల గంజాయి స్వాధీ నం చేసుకున్నాయి. విశాఖ జిల్లా తగరపువలస ప్రాంతానికి చెందిన అండి నాగరాజు, తమిళనాడులోని తేని జిల్లా ఉత్తమ పాళ్యం తాలూకా కక్కి సింగయన్‌ పట్టి గ్రామానికి చెందిన అనబలగన్‌ సిన్రసు ఏవోబీలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేస్తున్నారు. దీన్ని తరలించడానికి గూడ్స్‌ వ్యాన్‌కు వెనుక వైపు క్యాబిన్‌ను అరలుగా తయారు చేయించారు. వీటిలో 100 కిలోలు, మరో కారులో 100కిలోల గంజాయి ప్యాకెట్లను పెట్టి చెన్నైకి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న ఈగల్‌ బృందాలు విజయవాడ గీతానగర్‌ కట్ట వద్ద నాగరాజు, సిన్రసును అరెస్టు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jun 26 , 2025 | 04:46 AM