Home » Uddhav Thackeray
ఉద్ధవ్ 65వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసమైన మాతోశ్రీకి రాజ్ ఠాక్రే ఆదివారంనాడు వచ్చారు. ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి రాజ్ ఠాక్రే రావడం ఇదే మొదటిసారి.
మాతోశ్రీ పర్యటనలో భాగంగా రాజ్ ఠాక్రే మూడో అంతస్తు వరకూ వెళ్లి శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే గదిని సందర్శించారు. బాల్ ఠాక్రే కూర్చునే 'ఐకానిక్ చెయిర్'ను ఆ గదిలో పదిలపరిచారు. రాజ్ ఆ కుర్చీకి గౌరవపూర్వకంగా నమస్కరించి, బాల్ ఠాక్రేకు నివాళులర్పించారు.
ఫడ్నవిస్ ఆఫర్ ఇచ్చిన కొద్దిసేపటికి ఫడ్నవిస్, థాకరే నవ్వుతూ కరచాలనం చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే అది శాసనమండలి సమావేశం కావడానికి ముందు ఈ ఇద్దరు నేతలు కలుసుకున్న ఫోటో కావడం విశేషం.
హిందీని బలవంతంగా రుద్దడంపై రెండు దశాబ్దాలుగా కేంద్రతో విభేదిస్తున్న స్టాలిన్ శనివారంనాడు ఒక ట్వీట్‌లో ఉద్ధవ్, రాజ్ ఒకే వేదికపై కలుసుకోవడం, విజయోత్సవం జరుపుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ సోదరులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఠాక్రే సోదరులు సోదరుల కుమారులు ఉద్ధవ్, రాజ్ తొలిసారి ఒకే వేదికను పంచుకున్నారు.
శివసేన, యూబీటీ మధ్య పొత్తు ఉంటుందని అనుకుంటున్నారా అని నితేష్ రాణేను అడిగినప్పుడు, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ సారథ్యంలోని మహాయుతికి బలమైన తీర్పునిచ్చారని, ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉన్నా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
మహారాష్ట్ర సంస్కృతి, భాషాపరమైన గుర్తింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, దీనిపై విభేదాలు మరచి ఉద్ధవ్ థాకరేతో పనిచేసేందుకు సిద్ధమేనని రాజ్‌థాకరే ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. కీలకమైన అంశాలు తెరపైకి వచ్చినప్పుడు తమ మధ్య ఉన్న విభేదాలు చాలా స్పల్పమవుతాయని అన్నారు.
శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాకరేలు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొని ఉమ్మడి సందేశం ఇచ్చారు. మరాఠీ భాష, సాంస్కృతిక ప్రయోజనాల పరిరక్షణ చాలా ముఖ్యమని, దానిముందు రాజకీయ శత్రుత్వాలు పెద్ద విషయమేమీ కాదని అన్నారు.
కునాల్ కమ్రా షో జరిగిన హోటల్‌పై దాడిలో తమ పార్టీ కార్యకర్తల ప్రమేయం లేదని ఉద్ధవ్ థాకరే వివరణ ఇచ్చారు. అది 'గద్దర్ సేన' పని అని, ద్రోహం (గద్దర్) ఎవరి రక్తంలో ఉందో వాళ్లు ఎప్పుడూ శివసైనికులు కాలేరని అన్నారు.
అవిభక్త శివసేనను 2005లో రాజ్‌థాకరే విడిచిపెట్టాడు. 2006లో సొంతంగా ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన (యూబీటీ) 20 సీట్లు గెలుచుకోగా, ఎంఎన్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.