Uddhav Thackeray: మాకు అంతా ఇక మంచే... మాతోశ్రీకి రాజ్ రాకపై ఉద్ధవ్
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:55 PM
ఉద్ధవ్ 65వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసమైన మాతోశ్రీకి రాజ్ ఠాక్రే ఆదివారంనాడు వచ్చారు. ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి రాజ్ ఠాక్రే రావడం ఇదే మొదటిసారి.

ముంబై: మాతోశ్రీ (Matoshree) నివాసానికి తన సోదరుడు రాజ్ ఠాక్రే (Raj Thackeray) వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం చాలా ఆనందంగా ఉందని శివసేన (UBT) సుప్రీం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) చెప్పారు. తమ సోదరులిద్దరికీ భవిష్యత్తు బాగుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉద్ధవ్ 65వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసమైన మాతోశ్రీకి రాజ్ ఠాక్రే ఆదివారంనాడు వచ్చారు. ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి రాజ్ ఠాక్రే రావడం ఇదే మొదటిసారి. సోదరుల ఇద్దరూ ఎంతో ఆత్మీయంగా పలకరించుకుంటూ పండుగ వాతావరణాన్ని తలపించారు.
అనంతరం మీడియాతో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత తాము కలుకున్నామని, ఇద్దరూ ఎక్కడైతే పెరిగి పెద్దవాళ్లమయ్యామో అక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇక మంచి భవిష్యత్తు ఉంటుందని తాము అశిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఉద్ధవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం సోదరులిద్దరూ దివంగత బాల్‌ఠాక్రే చిత్తరువు బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోలు దిగారు. ఆ ఫోటను రాజ్ ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'నా పెద్ద సోదరుడు, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు బాల్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి వెళ్లాను' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
దగ్గరవుతున్న రాజ్, ఉద్ధవ్
అవిభక్త శివసేనను 2006లో రాజ్‌థాకరే విడిచిపెట్టారు. ఆ తర్వాత ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. అయితే, ఇటీవల కాలంలో తమ మధ్య దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు సోదరులిరువురూ చేస్తున్నారు. రాష్ట్ర స్కూళ్లలో మూడో భాషగా హిందీని ప్రవేశపెట్టే నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెనక్కి తీసుకుంది. ఇందుకోసం మొదట్నించీ గట్టి పట్టుతో ఉన్న ఠాక్రే సోదరులు ఈ సందర్భంగా నిర్వహించిన విక్టరీ ర్యాలీలో పాల్గొన్నారు. 'కలిసి ఉండేందుకే ఇద్దరూ కలిసాం' అని ఉద్ధవ్ ప్రకటించడం సోదరులిద్దరూ తిరిగి కలవనున్నారనే బలమైన సంకేతాలను ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే..ఎందుకంటే
జన్ సురాజ్ ఓట్లు చీల్చే పార్టీ.. కానీ ట్విస్ట్ ఉంటుంది
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి