Home » Tehran
ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషుయీ బుధవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడుల్లో తమ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ధ్రువీకరించారు.
ఇరాన్ ముందు జాగ్రత్తగా తరలించినట్టు చెబుతున్న 400 కేజీల యురేనియంతో సుమారు 10 అణుబాంబులు తయారు చేయవచ్చనేది ఒక అంచనా. 'మిస్సింగ్' యురేనియం 60 శాతం ఎన్‌రిచ్ అయిందని, 90 శాతం ఎన్‌రిచ్ స్థాయికి తీసుకువెళ్తే అణ్వాయుధాలలో ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
ఇరాన్ నుంచి ఇంతవరకూ 2,295 మంది భారతీయులను వెనక్కి తీసుకు వచ్చినట్టు రణ్‌ధీర్ జైశ్వాల్ చెప్పారు. వీరితో పాటు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న 165 మంది భారతీయులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సి-17 మిలటరీ రవాణా విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు.
ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 1,000 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ ఇరాన్‌లో బెహ్నామ్ షాహ్‌రియారీ నడుపుతున్న వాహనంపై బాంబు దాడి జరపడంతో అతను హతమైనట్టు ఐడీఎఫ్ ధ్రువీకరించింది. ప్రాక్సీలకు ఇరాన్ ఆయుధాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షించడంలో ఇతను కీలకవ్యక్తిగా ఉన్నట్టు తెలిపింది.
ఇజ్రాయెల్‌తో పాటు స్వతంత్ర పాలిస్తీనాతో రెండుదేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి భారత్ చిరకాలంగా కట్టుబడి ఉందని, దానికి కేంద్రం దూరమైనట్టు కనిపిస్తోందని సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు.
ఇరాన్ నగరాల్లో చిక్కుకుపోయిన సుమారు 1,000 మంది భారతీయ విద్యార్థులను 'ఆపరేషన్ సింధు' కింద ప్రత్యేక విమానాల్లో న్యూఢిల్లీకి తీసుకు వస్తున్నారు. రాబోయే రెండ్రోజుల్లో వీరంతా ఢిల్లీకి చేరుకుంటారు.
తొలి దఫాగా జూన్ 17న ఉత్తర ఇరాన్ నుంచి అక్కడి భారత రాయబార కార్యాలయం విజయవంతంగా అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులను భారత్‌కు తీసుకువస్తున్నారు.
ఇరాన్‌లో 4,000 మంది భారతీయులుండగా, వారికి సగం మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలోనూ ఎక్కువ మంది జమ్మూకశ్మీర్‌కు చెందిన వారున్నారు. వీరు ప్రధానంగా మెడికల్, ఇతర వృత్తివిద్యా కోర్టులు చేస్తున్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనికి సన్నిహిత సైనిక సలహాదారుడుగా కూడా అలి షాద్మానీ ఉన్నారు. సెంట్రల్ టెహ్రాన్‌లో షాద్మానీ తలదాచుకున్నట్టు కచ్చితమైన సమాచారంలో దాడులు జరిరినట్టు ఐడీఎఫ్ తెలిపింది.
ప్రస్తుతం సుమారు 10,000 మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. వీరిలో 6,000 మంది విద్యార్థులు ఉన్నారు. భద్రతా కారణాల దృష్ఠ్యా భారతీయులను తరలిస్తున్నట్టు విదేశాంగ తెలిపింది.