Share News

Operation Sindhu: అపరేషన్ సింధు షురూ..ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు

ABN , Publish Date - Jun 18 , 2025 | 09:30 PM

తొలి దఫాగా జూన్ 17న ఉత్తర ఇరాన్‌ నుంచి అక్కడి భారత రాయబార కార్యాలయం విజయవంతంగా అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులను భారత్‌కు తీసుకువస్తున్నారు.

Operation Sindhu: అపరేషన్ సింధు షురూ..ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతుండటంతో ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి 'ఆపరేషన్ సింధు' (Operation Sindhu) అనే నామకరణం చేసింది.


తొలి దఫాగా జూన్ 17న ఉత్తర ఇరాన్‌ నుంచి అక్కడి భారత రాయబార కార్యాలయం విజయవంతంగా అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులను భారత్‌కు తీసుకువస్తున్నారు. అర్మేనియా క్యాపిటల్ సిటీ యెరవాన్ నుంచి బుధవారంనాడు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి వీరు బయలుదేరారు. ఈ విమానం గురువారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంటుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.


కాగా, భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సహకరించిన ఇరాన్, అర్మేనియా ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లోని భారత పౌరుల భద్రత తమ అత్యంత ప్రాధాన్యతా క్రమాల్లో ఒకటని ఇండియా పునరుద్ఘాటించింది. ఇందులో భాగంగా టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ అక్కడి హై-రిస్క్ జోన్లలో ఉన్న భారతీయులను ఇరాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగించాలని అక్కడి భారతీయులను కోరింది.


టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్స్

1.For calls only: +98 9128109115, +98 9128109109

2.For WhatsApp: +98 9010445557, +98 9015993320, +91 8086871709


ఇవి కూడా చదవండి..

అగ్నిపర్వతం బద్దలవడంతో వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

భారతదేశ విమానయాన చరిత్రలో అతిపెద్ద బీమా క్లెయిమ్

For More National News

Updated Date - Jun 18 , 2025 | 09:33 PM