Israel Iran conflict: ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 100 మంది భారతీయ విద్యార్థులు
ABN , Publish Date - Jun 17 , 2025 | 01:22 PM
ప్రస్తుతం సుమారు 10,000 మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. వీరిలో 6,000 మంది విద్యార్థులు ఉన్నారు. భద్రతా కారణాల దృష్ఠ్యా భారతీయులను తరలిస్తున్నట్టు విదేశాంగ తెలిపింది.

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran)మధ్య యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతుండటంతో 100 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్ సిటీ ఉర్మియాను వదిలిపెట్టి అర్మేనియా సరిహద్దు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని తొలి బ్యాచ్ కింద మంగళవారంనాడు ఇండియాకు తరలించే అవకాశం ఉంది.
ప్రస్తుతం సుమారు 10,000 మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. వీరిలో 6,000 మంది విద్యార్థులు ఉన్నారు. భద్రతా కారణాల దృష్ఠ్యా భారతీయులను తరలిస్తున్నట్టు విదేశాంగ తెలిపింది. ఇజ్రాయల్ దాడులతో ఇంతకుముందు సుమారు 600 మంది విద్యార్థులను టెహ్రాన్ నుంచి ఖోమ్ సిటీకి తరలించారు. మరికొందరిని షిరాజ్, ఇష్ఫాన్ నుంచి యాజ్డ్ నగరానికి తరలించారు. టెహ్రాన్ సిటీ నుంచి దూరంగా తరలించేందుకు అక్కడి భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసిందని ఎంఈఏ తెలిపింది. భద్రతా పరిస్థితిని టెహ్రాన్ ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఇరాన్‌లోని భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. కొందరిని ఇరాన్‌లోనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నామని పేర్కొంది.
ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో టెహ్రాన్ నగరంలోని ఇండియన్ ఎంబసీ అడ్వయిజరీ జారీ చేసింది. అక్కడున్న భారతీయులు టెహ్రాన్ వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. భారత ఎంబసీతో కాంటాక్టులో ఉండాలని కోరింది.
ఇవి కూడా చదవండి..
ఆ ఒక్క షరతుపై చర్చలకు సిద్ధమేనన్న టెహ్రాన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి