Share News

Iran: ఇరాన్‌కు గట్టి దెబ్బ.. ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు టాప్ కమాండర్లు హతం

ABN , Publish Date - Jun 21 , 2025 | 07:18 PM

ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 1,000 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ ఇరాన్‌లో బెహ్నామ్ షాహ్‌రియారీ నడుపుతున్న వాహనంపై బాంబు దాడి జరపడంతో అతను హతమైనట్టు ఐడీఎఫ్ ధ్రువీకరించింది. ప్రాక్సీలకు ఇరాన్ ఆయుధాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షించడంలో ఇతను కీలకవ్యక్తిగా ఉన్నట్టు తెలిపింది.

Iran: ఇరాన్‌కు గట్టి దెబ్బ.. ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు టాప్ కమాండర్లు హతం
Israel Defense Forces

టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికే పలువురు కీలక నేతలు, అణు శాస్త్రవేత్తలను కోల్పోయిన ఇరాన్ తాజాగా మరో ముగ్గురు టాప్ కమాండర్లను కోల్పోయింది. దీంతో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు గట్టి దెబ్బ తగిలింది. ఈ దాడుల్లో మృతి చెందిన కమాండర్లలో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధ సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్‌రియారీ (Behnam Shahriari) కూడా ఉన్నట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ప్రకటించింది.


ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 1,000 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ ఇరాన్‌లో బెహ్నామ్ షాహ్‌రియారీ నడుపుతున్న వాహనంపై బాంబు దాడి జరపడంతో అతను హతమైనట్టు ఐడీఎఫ్ ధ్రువీకరించింది. ప్రాక్సీలకు ఇరాన్ ఆయుధాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షించడంలో ఇతను కీలకవ్యక్తిగా ఉన్నట్టు తెలిపింది. లెబనాన్‌లో హెజ్‌బుల్లా, గాజాలో హమాస్, యెమెన్‌లో హౌతీ మిలీటియాకు నేరుగా ఆయుధాల సరఫరాలో ఇతని ప్రమేయం ఉంది. ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇజ్రాయెల్ పౌరులు, సైనిక బలగాలపై ప్రయోగించిన రాకెట్లు, క్షిపణులను సరఫరా చేయడంలో సాహ్‌రియారీ పాత్ర కీలకమని ఐడీఎఫ్ తెలిపింది.


కాగా, ఇజ్రాయెల్ శనివారం ఉదయం జరిపిన మరో దాడిలో ఖుద్స్ ఫోర్స్ పాలస్తీనా డివిజన్ హెచ్ సయీద్ ఇజాదీ మరణించాడు. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న మమాస్ మారణహోమానికి పాల్పడడానికి ముందు ఈ ఘటనకు ప్లానింగ్, వనరుల సరఫరా వంటివి ఇజాదీ చేసినట్టు ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారంనాడే ఇరాన్‌కు చెందిన మరో కమాండర్ అమిన్ పౌర్ జోడకీ కూడా హతమైనట్టు పేర్కొంది. ఐఆర్‌జీసీ సెకెండ్ డ్రోన్ యూనిట్‌కు ఇతను డిప్యూటీ కమాండర్‌గా ఉన్నట్టు తెలిపింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఈ దాడులు చేపడుతోంది.


ఇవి కూడా చదవండి..

9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను

For International News And Telugu News

Updated Date - Jun 21 , 2025 | 08:30 PM