Home » Kalyanadurgam
గొలుసు దొంగను పట్టుకోబోయి.. ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతిచెందిన బీఎ్‌సఎఫ్ జవాన లక్ష్మన్నకు ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పట్టణవాసులు సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు.
పట్టణంలోని పట్టాభిరామస్వామికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్టు వస్త్రాలు నేయించారు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా మంగళవారం పట్టువస్త్రాలను సమర్పించారు.
మంత్రి నారాలోకేశ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరానికి నియోజకవర్గంలోని ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కదలిరావాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు.
ల్లాకు కేటాయించిన డీఎస్సీ పోస్టులలో అత్యధికంగా ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. బుధవారం క్రిస్మస్ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణం, కంబదూరులోని చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
వైసీపీ పాలనలో హంద్రీనీవా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. మండలంలోని కోనాపురం వద్దనున్న 11వ పంపుహౌ్‌సను సోమవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడ విద్యుత సబ్‌స్టేషను నిర్మాణానికి రూ.2.71 కోట్లు విడుదల చేశామన్నారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన చేసిన అవినీతి, అక్రమాలు అమెరికాకు పాకిందంటే ఆయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు.
వైసీపీ నిరంకుశ పాలనతో గాడితప్పిన వ్యవస్థలను చక్కదిద్ది.. ప్రజా సంక్షేమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా రామసాగరంలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతామని, సంక్షేమ పథకాలను అందిస్తామని కలెక్టర్ అన్నారు. పొలంబడి, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర ...
వరద బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపుతో భారీగా విరాళాలు వచ్చాయి. కళ్యాణదుర్గం నుంచి విజయవాడకు మంగళవారం రాత్రి ఆరు లారీల్లో నిత్య వసర సరుకులను తరలించారు. వాటిని విజయవాడలో బుధవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 200 మంది వలంటీర్లు, టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ, కళ్యాణదుర్గం నాయకులు పంపిణీ చేశారు.
గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, పాపాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఐదేళ్లుగా ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారు. చుక్కల భూములు ఎన్ని ఎకరాలు చక్కబెట్టారు. నిషేధిత జాబితా నుంచి ఎంత తొలగించారనే వివరాలను ఆరా తీసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నుంచే దోపిడీకి బీజం పడింది. నియోజకవర్గంలోని కంబదూరు, కళ్యాణదుర్గంలో పనిచేసిన తహసీల్దార్లపై అధికార పార్టీ నాయకులు ...