MLA AMILINENI: రక్తదాన శిబిరానికి కదలిరండి
ABN , Publish Date - Jan 21 , 2025 | 11:46 PM
మంత్రి నారాలోకేశ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరానికి నియోజకవర్గంలోని ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కదలిరావాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు.

కళ్యాణదుర్గం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మంత్రి నారాలోకేశ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరానికి నియోజకవర్గంలోని ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కదలిరావాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. వాల్మీకి కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ వైపీ రమేష్, మండల కన్వీనర్ గోళ్లవెంకటేశులతో కలిసి ఎమ్మెల్యే పట్టణంలోని ప్రజావేదిక వద్ద మంగళవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 23వ తేదీన మంత్రి లోకేశ పుట్టినరోజు సందర్భంగా ప్రజావేదిక వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశలు ఇక్కడే చేపట్టే రక్తదాన శిబిరాన్ని గుర్తించేవిధంగా ఉండాలన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ: బ్రెయిన ట్యూమర్‌తో బాధపడుతున్న లిఖిత తల్లిదండ్రులకు సీఎం సహాయ నిధి కింద రూ.10 లక్షల చెక్కును ఎమ్మెల్యే సురేంద్రబాబు అందచేశారు. టీడీపీ నాయకులతో కలిసి మంగళవారం ఈ సహాయ నిధి చెక్కును అందచేశారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే: మండలంలోని మల్లిపల్లిలో చౌడేశ్వరి జాతర సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్యే సు రేంద్రబాబు దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు గ్రామస్థులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.