Home » Anantapur urban
విద్యారంగ పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని అఖిల భారత విద్యార్థిబ్లాక్ జాతీయ కన్వీనర్ బాలజయవర్దన, పార్వర్డ్‌బ్లాక్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీవీసుందరరామరాజు పేర్కొన్నారు. అఖిలభారతవిద్యార్థిబ్లాక్ 3వ రాష్ట్రమహాసభలు బుధవారం వారు నగరంలో నిర్వహించారు.
క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎంపీడీవో రవిప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలోని ఉరవకొండ, వజ్రకరూరులో శనివారం ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించారు.
శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్ర్‌సగా వైసీపీ మారిపోయిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. శనివారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద నియోజకవర్గం నుంచి భారీసంఖ్యలో ప్రజలు వివిధ సమస్యలను విన్నవించేందుకు తరలిరావడంతో వారి నుంచి అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక(ప్రజాదర్బార్) నిర్వహించారు.
అమెరికా దేశంలోని న్యూయార్క్ మేయర్‌గా జహ్రాన మమ్దాని ఎన్నికకావడం అపూర్వమని సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప అన్నారు. మేయర్‌గా మమ్దానీ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ కూడలి వద్ద ఆయన చిత్రపటంతో ప్రదర్శన నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలోని వాటర్ సప్లై కార్మికులపై అక్రమ చర్యలను నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నగరపాలక సంస్థలో ప్రధాన అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇనచార్జ్‌లతో నే పాలనను నెట్టుకొస్తున్నారు. ఏఎంసీ సెక్రటరీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, ఏసీపీ, మేనేజర్, అడిషినల్ కమిషనర్ ఇలా అన్ని రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో నగరపాలక సంస్థ ఆశించిన మేర అభివృద్ధికి నోచుకోలేకపోతోంది. నగరపాలక సంస్థగా రూపాంతరం చెంది దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా నగరంలో అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది.
విద్యార్థులకు సైన్సతో కూడిన సృజనాత్మకత అవసరమని జీవశాస్త్ర అధ్యాపకురాలు అరుణ అన్నారు. జనవిజ్ఞాన వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కేఎ్‌సఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన చెకుముకి మండలస్థాయి సైన్స సంబరాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
కార్తీకమాసమంటేనే భక్తిభావం. ఈ మాసంలో పౌర్ణమి రోజు వెలిగించే ప్రతి దీపంలోనూ సాక్షాత్తు త్రయంబకేశ్వరుడు కొలువై వుంటాడన్నది పురాణాలు చెబుతున్న సారాంశం. ఈ పర్వదినంకోసం యావత్ భక్తకోటి వేయికళ్లతో ఎదురుచూస్తుంటుంది.
దేవుడికి సేవ చేయాలన్నదే నా లక్ష్యమని సూగూరు ఆంజనేయస్వామి ఆలయ నూతన చైర్మన వైసీ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఆలయం వద్ద చైర్మన, కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ అధికారులు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.