WATER LABOUR: తాగునీటి కార్మికులపై అక్రమ చర్యలు నిలిపివేయాలి
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:06 AM
ఉమ్మడి జిల్లాలోని వాటర్ సప్లై కార్మికులపై అక్రమ చర్యలను నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనంతపురం టౌన, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని వాటర్ సప్లై కార్మికులపై అక్రమ చర్యలను నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 17 సంవత్సరాలుగా ప్రజలకు నరింతరాయంగా తాగునీటి సేవలందిస్తున్న కార్మికులపై కొత్త కాంట్రాక్టర్ అడపాల వెంకటరావు దౌర్జన్యపూర్వకంగా వ్యవహరిస్తున్నాడన్నారు. కార్మికులతో రూ.100 ఖాళీ బాండ్లపై బలవంతంగా సంతకాలు చేయించుకోవడమేకాక వారి వేతనాలను రూ.17300లను రూ.11వేలకు తగ్గించి, పీఎఫ్, ఈఎ్‌సఐ, బోనస్ వంటి హక్కులను నిరాకరించాడన్నారు. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా నిలిచిన 23 మంది కార్మికులను విధుల నుంచి అక్రమంగా తొలగించారని తెలిపారు. ఈ చర్యలు కార్మిక చట్టాలకు, మానవ హక్కులకు విరుద్ధం మాత్రమే కాక ప్రజలకు తాగునీరందించే ముఖ్యమైన సేవా వ్యవస్థను కూడా అస్థిరం చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దశలవారీగా నిరసనలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు ఆర్‌వీ నాయుడు పాల్గొన్నారు.