MLA AMILINENI: శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:24 AM
శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్ర్‌సగా వైసీపీ మారిపోయిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. శనివారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద నియోజకవర్గం నుంచి భారీసంఖ్యలో ప్రజలు వివిధ సమస్యలను విన్నవించేందుకు తరలిరావడంతో వారి నుంచి అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు.
కళ్యాణదుర్గం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్ర్‌సగా వైసీపీ మారిపోయిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. శనివారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద నియోజకవర్గం నుంచి భారీసంఖ్యలో ప్రజలు వివిధ సమస్యలను విన్నవించేందుకు తరలిరావడంతో వారి నుంచి అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అది చూసి వైసీపీ నాయకులకు మతిభ్రమించి లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిస్థితి ఏవిధంగా వుంది, కూటమి ప్రభుత్వం వచ్చి న తరువాత ఎలా వుందనే విషయాన్ని వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజావేదికలో వచ్చిన ప్రజా సమస్యలను ప్రజల సమక్షంలోనే తెలుసుకుని అక్కడికక్కడే ఆయా శాఖల అధికారులకు తెలియజేస్తూ వాటిని పరిష్కరిస్తున్నారు. ఇటీవల శెట్టూరు మండలం మంగంపల్లికి చెందిన షేక్ కరీమ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన భార్య షంషాద్‌కు రూ.25 వేలు ఆర్థిక సాయం అందించారు. పట్టణంలోని టీడీపీ నాయకులు పురుషోత్తమ్ ఆకస్మికంగా మృతి చెందడంతో కుమారుడు, కుమార్తె చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని అభయమిచ్చారు.