MLA JAYARAM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం:
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:20 AM
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక(ప్రజాదర్బార్) నిర్వహించారు.
పామిడి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక(ప్రజాదర్బార్) నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అప్పటికప్పుడే కొన్ని సమస్యలపై జిల్లాస్థాయి అధికారులతో మాట్లాడారు. ఎద్దులపల్లి గ్రామంలో ఇందిర్మ హయాంలో పక్కాగృహాలతో పాటు ఇళ్ల పట్టాలు అందజేశారన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌కు కేవలం గుత్తి, గుంతకల్లు డిపో బస్సులు మాత్రమే వస్తున్నాయని, ఇతర డిపోల బస్సులు హైవేలోనే వెళ్తున్నాయని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పలు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఇళ్ల స్థలాలు, పట్టాలు, పింఛన్లు మంజూరుకు వినతులు అందాయి. టీడీపీ మండల ఇనచార్జి గుమ్మనూరు ఈశ్వర్, తహసీల్దార్ షర్మిల, ఎంపీడీఓ తేజోత్స్న, డిప్యూటీ ఎంపీడీఓ అశ్వత్థామ నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మూడు చక్రాల బండి ఇప్పించాలని దివ్యాంగురాలు శిరీష ఎమ్మెల్యేను కోరగా బ్యాటరీతో నడిచే బండి మంజూరయ్యే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి రెండు బాడీ ఫ్రీజర్లు వితరణ చేస్తామని పీఆర్‌కే బాబు ప్రకటించడంపై ఎమ్మెల్యే ఆయనను అభినందించారు.
చంద్రన్నతోనే రైతన్న సంక్షేమం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే రైతన్న సంక్షేమం సాధ్యపడుతోందని గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం రైతు సంక్షేమంలో మనమంచి ప్రభుత్వం కరపత్రాలను టీడీపీ మండల ఇనచార్జి గుమ్మనూరు ఈశ్వర్‌తో కలిసి విడుదల చేశారు. ఏఓ విజయకుమార్, పీ కొత్తపల్లి సహకార బ్యాంకు చైర్మన బొల్లు శ్రీనివాసరెడ్డి, రైతులు పాల్గొన్నారు.