పట్టాభి రాముడికి పట్టు వసా్త్రలు సమర్పించిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Feb 11 , 2025 | 11:59 PM
పట్టణంలోని పట్టాభిరామస్వామికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్టు వస్త్రాలు నేయించారు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా మంగళవారం పట్టువస్త్రాలను సమర్పించారు.

కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పట్టాభిరామస్వామికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్టు వస్త్రాలు నేయించారు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా మంగళవారం పట్టువస్త్రాలను సమర్పించారు. హిందూ, ముస్లింలు ఐక్యతను చాటుతూ ముస్లిం తీసుకువచ్చిన లక్ష పూలను ఎమ్మెల్యే ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సంప్రదాయ బద్దంగా స్వామి వారికి పట్టువసా్త్రలు, పూలు, పండ్లు సమర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా హిందూ, ముస్లింల ఐక్యత మన కళ్యాణదుర్గంలో వచ్చిందన్నారు. ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మన ప్రాంతంలోని రైతులు మంచి పంటలు పండించాలని, బీటీపీ కాలువ త్వరగా పూర్తి అయ్యేలా దీవించాలని స్వామివారిని కోరుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భక్తులకు వడ్డించారు. అయోధ్య బాలరాముడి ఆలయానికి గంటలు అందించిన రాజేంద్రనాయుడు పట్టాభి రామాలయానికి కూడా గంటను అందించారు.
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
బ్రహ్మసముద్రం: మండలంలోని పడమటి కోడిపల్లి గ్రామంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరై పూజలు నిర్వహించారు. గ్రామస్థులు ఎమ్మెల్యేకు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ గ్రామంలో ఉన్న ప్రజలు ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు రాషా్ట్రన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. జడ్పీటీసీ ప్రభావతమ్మ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు, మాజీ కన్వీనర్ వెంకటేశులు, క్లస్టర్ ఇనచార్జి నాగరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.