Share News

డీఎస్సీ అభ్యర్థులు.. ఉద్యోగాలు సాధించాలి

ABN , Publish Date - Jan 20 , 2025 | 12:14 AM

ల్లాకు కేటాయించిన డీఎస్సీ పోస్టులలో అత్యధికంగా ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు.

డీఎస్సీ అభ్యర్థులు.. ఉద్యోగాలు సాధించాలి
MLA Amilineni inspecting the DSC Model Examination Centre

కళ్యాణదుర్గం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాకు కేటాయించిన డీఎస్సీ పోస్టులలో అత్యధికంగా ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం ఇన్ఫినిటీ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన బద్దేనాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన డీఎస్సీ మోడల్‌ పరీక్షను పట్టణంలోని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. మోడల్‌ పరీక్ష కేంద్రానికి ఎమ్మెల్యే వెళ్లి పరిశీలించారు. పరీక్షలు రాసే అభ్యర్థులను పలకరించి వారితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి డీఎస్సీ మోడల్‌ పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్న బద్దేనాయక్‌ను అభినందించారు. ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుందని అన్నారు.

Updated Date - Jan 20 , 2025 | 12:14 AM