CRIMATION: జవానకు కన్నీటి వీడ్కోలు
ABN , Publish Date - Feb 18 , 2025 | 12:08 AM
గొలుసు దొంగను పట్టుకోబోయి.. ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతిచెందిన బీఎ్‌సఎఫ్ జవాన లక్ష్మన్నకు ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పట్టణవాసులు సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు.

బ్రహ్మసముద్రం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): గొలుసు దొంగను పట్టుకోబోయి.. ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతిచెందిన బీఎ్‌సఎఫ్ జవాన లక్ష్మన్నకు ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పట్టణవాసులు సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. బీఎ్‌సఎఫ్ సిబ్బంది సైనిక విమానంలో ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరుకు తీసుకువచ్చారు. అక్కడి ఆర్మీ క్యాంపు ఆఫీసులో సైనిక వందనం నిర్వహించి, రోడ్డు మార్గాన బ్రహ్మసముద్రానికి ఆదివారం రాత్రి తీసుకువచ్చారు. తహసీల్దార్ సుమతి, జడ్పీటీసీ ప్రభావతి, ఎంపీడీవో నందకిషోర్, టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు, ఎంపీపీ చంద్రశేఖర్ రెడ్డి, పలువురు అధికారులు, నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. మండల ప్రజలు తరలివచ్చి నివాళులు అర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నాగేంద్ర కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.