Home » Collages
రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కళాశాలలపై వచ్చిన ఫిర్యాదులు, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో బయటపడిన అవకతవకల నేపథ్యంలో వైద్యవిద్యలో నాణ్యతాప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని తాజాగా చర్యలకు ఉపక్రమించింది.
వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని వైద్య కళాశాలల అధ్యాపకులకు రికార్డు స్థాయిలో పదోన్నతులు కల్పించారు. 33 విభాగాల్లో 309 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతినిస్తూ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ బుధవారం 3 వేర్వేరు జీవోలు జారీ చేశారు.
వరంగల్ జిల్లాలోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) రద్దు చేసి, కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసింది.
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు అంశంపై దాఖలైన పిటిషన్యలను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది.
ప్రైవేటు వైద్య కళాశాలల్లో తనిఖీలకు ముందు గానీ, తర్వాత గానీ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేర్కొంది.
సాధారణంగా ప్రామిసరీ నోటును అప్పు తీసుకున్న వారు రాసి ఇస్తారు. అయితే, ఓ ప్రైవేటు కాలేజీ మాత్రం ఫీజు బకాయి ఉన్న విద్యార్థి నుంచి అప్పు పత్రం రాయించుకుంది.
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు.. తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) బృందాలకు లంచాలిచ్చి, తమకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకున్నాయి.
ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెంచుకునేందుకు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)కి హైకోర్టు అనుమతి ఇచ్చింది.
వైద్యఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మెడికల్ బోర్డు సెక్రటరీ గోపికాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు.
పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.